ఆలయంలో 55 మందికి కరోనా.. !

By AN TeluguFirst Published Feb 22, 2021, 10:27 AM IST
Highlights

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా జాల్నా జిల్లాలోని ఒక ఆలయంలోని సిబ్బంది, ఆలయం వెలుపల ఉన్నవారు మొత్తం 55 మందికి కరోనా సోకిందని తేలడంతో జిల్లా అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసేశారు. 

ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ జయదేవ్ వాడిలో జాలీచాదేవి మందిరం ఉంది. ఇక్కడ పూజలు చేసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విపరీతంగా తరలివస్తారని తెలిపారు. 

రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు చూసి అధికారులు షాక్ అయ్యారు. మొత్తం 55 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వెంటనే ఆలయాన్ని మూసివేశామని అధికారి తెలిపారు. ఆలయం బయట బారికేడ్లు కూడా ఏర్పాటు చేశామని  తెలిపారు. 

ఆలయ రహదారిలో రాకపోకలు కూడా నిలిపివేశామని అన్నారు. అలాగే గ్రామంలో ఆరోగ్య కార్యకర్తల బృందం పర్యటిస్తున్నదని, వారు అక్కడి అక్కడి ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో యేటా జరిగే మేళాను కూడా కరోనా కారణంగా ఈ సారి రద్దు చేశామని తెలిపారు. 

click me!