
Prophet Muhammad Row: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం సృష్టిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఇస్లామిక్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కువైట్, ఖతార్, ఇరాన్ దేశాల్లోని భారత రాయబారులకు సమన్లు జారీ చేశారు. ఇదే బాటలో సౌదీ అరేబియా, యూఏఈ, ఇండోనేసియా తదితర ఇస్లామిక్ దేశాలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలపై బీజేపీ పార్టీ తీసుకుంది.. అయినా.. ఇప్పట్లో ఈ వ్యవహరం ముగిసేలా లేదు. మన దేశ వ్యాప్తంగా పలువురు నేతలు.. బీజేపీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టాయి. వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
తాజాగా భీమ్ ఆర్మీ చీఫ్ నవాబ్ సత్పాల్ తన్వర్ నుపుర్ శర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నూపుర్ శర్మ నాలుక కోసిన వ్యక్తికి కోటి రూపాయల రివార్డును ప్రకటించారు. నూపుర్ శర్మ ప్రవక్తను అవమానించారని, ఇది కోట్లాది ముస్లిం సమాజాన్ని బాధపెట్టిందని ఆరోపించారు. కానీ పోలీసులు ఇప్పటివరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సత్పాల్ తవంత్ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను బెదిరించి.. పలుమార్లు వివాదాలు సృష్టించారు.
నుపుర్ శర్మకు వ్యతిరేకంగా AIMIM నిరసన
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి నూపుర్ శర్మకు అనుకూలంగా, వ్యతిరేకిస్తూ భిన్నమైన వాక్చాతుర్యం, ప్రదర్శనలు జరుగుతున్నాయి. నేడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లకు వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నది. మరో వైపు .. హిందూ మహాసభ నుపుర్ శర్మకు మద్దతుగా లక్నోలో పాదయాత్ర చేపట్టనుంది.
ఇప్పుడు నుపుర్ శర్మ ఇంట్లో బుల్డోజర్ పని చేస్తుందా? - ఒవైసీ
అంతకుముందు రోజు.. AIMIS చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. నుపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలు క్షమించలేనివనీ, తన ప్రకటనలో ఇంగ్లీషులో 'ఇఫ్' అని రాసిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ల రాజకీయాలు చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
ఏదైనా జరిగినప్పుడు.. అది బుల్‌డోజర్‌లను నడుపుతుంది, కాబట్టి ఇప్పుడు నుపుర్ శర్మ ఇంట్లో బుల్‌డోజర్ నడుస్తుందా? దేశంలోని ముస్లింల విషయానికి వస్తే ప్రధాని మోదీ తమ మాట వినడం లేదన్నారు. ప్రధానికి భారతీయ ముస్లింల బాధలు అర్థం కావడం లేదనీ, దేశంలోని ముస్లింలను బీజేపీ కించపరిచిందని ఆరోపించారు.