ముస్లింల అక్షరాస్యత ఆందోళనకరం.. నానాటికీ పెరుగుతున్న డ్రాపౌట్స్..

Published : May 08, 2023, 03:54 PM ISTUpdated : May 08, 2023, 04:02 PM IST
ముస్లింల అక్షరాస్యత ఆందోళనకరం.. నానాటికీ పెరుగుతున్న డ్రాపౌట్స్..

సారాంశం

భారతదేశంలో ముస్లిం సమాజానికి చెందిన పిల్లలు బడి మానేస్తున్నారు. ఆర్థిక , సామాజిక పరిస్థితులు వారికి అడ్డంకులుగా మారాయి. చాలా తక్కువ మంది అబ్బాయిలు ఉన్నత విద్యను పొందుతున్నారు.అదే సమయంలో బాలికలలో డ్రాపౌట్ రేటు పెరుగుతునే ఉంది.

దేశంలో అక్షరాస్యత రేటు విషయంలో ముస్లింలు వెనకబడిపోయారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా లేదా వారి కంటే తక్కువ అక్షరాస్యత రేటును కలిగి ఉన్నారు. అలాగే దేశంలోని ఇతర మతాలతో పోల్చి చూసుకున్నా.. ఈ విషయంలో ముస్లింలు వెనకబడే ఉన్నారు. అదే సమయంలో ముస్లిం విద్యార్థుల్లో డ్రాపౌట్ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ విషయం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ స్టడీస్ (Institute of Objective Studies) అనే నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ రిపోర్టును జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ రుబీనా తబస్సుమ్ తయారు చేశారు. ఈ నివేదికలో ముస్లిం డ్రాప్ అవుట్‌ల గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ నివేదిక ప్రకారం.. విద్యాసంస్థల్లో ముస్లింల డ్రాప్ అవుట్ రేటు పెరుగుతోందనీ, ముస్లింలలో స్కూల్ అడ్మిషన్ రేటు తగ్గుతోందని వెల్లడైంది. పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల జనాభా 27 శాతం ఉండగా.. అక్కడ ముస్లింల డ్రాప్ అవుట్ శాతం 27.2, హిందువుల డ్రాప్ అవుట్ శాతం 22.0 గా నమోదైంది. అలాగే.. బీహార్‌లో 13.9 శాతం ముస్లింలు డ్రాప్ అవుట్‌లు మిగిలిపోయారు. మరోవైపు ముస్లింల ఆదాయం పెరిగినా చదువుపై దృష్టి సారించలేకపోతున్నారని పలు ఆసక్తిక విషయాలను వెల్లడించింది ఈ నివేదిక.  

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ స్టడీస్ సమర్పించిన నివేదికకు Status of Muslim Dropout in Comparative Perspective అనే పుస్తక రూపంలోకి తీసుకవచ్చారు ప్రొఫెసర్ రూబియా తబస్సుమ్. అదే సమయంలో ఆమె దళిత, ఆదివాసీ వర్గాలపై నివేదికలు కూడా సమర్పించారు. ప్రొఫెసర్ రుబీనా తబస్సుమ్ ప్రకారం.. జాతీయ సగటు డ్రాప్ అవుట్  రేటు 18.96 శాతంతో పోలిస్తే.. ముస్లిం డ్రాపౌట్ రేటు 23.1 శాతం. 2017-18లో విద్యా మంత్రిత్వ శాఖ 18.96 శాతం డ్రాపౌట్‌ను గుర్తించిందనీ, ఇందులో ముస్లిం సమాజంలో 23.01 శాతం డ్రాపౌట్స్ ఉన్నారని రుబీనా తబస్సుమ్ తెలిపారు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో ఇతర వర్గాల కంటే ముస్లిం విద్యార్థులు ఎక్కువగా డ్రాప్ అవుట్ అవుతున్నారని ఆమె గుర్తించారు.  

బెంగాల్, లక్షద్వీప్, అస్సాం వంటి రాష్ట్రాల్లో ముస్లిం విద్యార్థుల డ్రాపౌట్స్ శాతం ఎక్కువగా ఉందని , మతపరమైన విద్యపై చూపుతున్న ఆసక్తి.. అధికారిక విద్యపై చూపడం లేదని ఆమె చెప్పారు. విద్యా హక్కు చట్టం ప్రకారం.. 6-14 సంవత్సరాల వయస్సు వరకు నిర్బంధ విద్య సదుపాయం కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కానీ, ముస్లింలు ఆ బాధ్యతను నిర్వర్తించడం లేదనీ, 15 సంవత్సరాలు దాటిన తరువాత వారిని పనిలోకి నెట్టివేస్తారని పేర్కోన్నారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లోనూ ముస్లింల్లో విద్యా పరిస్థితి అధ్వానంగానే ఉందని వాపోయారు.  

జమ్మూ కాశ్మీర్‌లో డ్రాప్ అవుట్ శాతం ఇలా ఉంది. 

ప్రీ క్లాస్‌లో             హిందువు 0.0 %, ముస్లిం 0.7%, 

ప్రైమరీ క్లాస్‌లో     హిందువు 6.5%, ముస్లిం 5.5%, 

సెకండరీ క్లాస్‌లో    హిందూ 17.3%, ముస్లింలు 25.8 %.

>> అస్సాంలోనూ ముస్లిం విద్య పరిస్థితి బాగా లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో ముస్లింలు 34.22 శాతం ఉండగా.. ఇక్కడ కూడా ముస్లింల డ్రాప్ అవుట్ ఆందోళన కలిగిస్తోంది. డ్రాప్ అవుట్ శాతం ఇలా ఉంది

ప్రీ ప్రైమరీలో              హిందూ 6.0%, ముస్లిం 5.9%,

ప్రైమరీలో                   హిందూ 15.0%, ముస్లిం 12.5%,   

మధ్యతరగతి లో          హిందూ 18.0%, ముస్లిం 26.0 %, 

సెకండరీ క్లాస్‌లో          హిందూ 25.8 %, ముస్లిం 30.2 %,

హయ్యర్ సెకండరీలో   హిందూ 13.9 %, ముస్లింలు 19.6%,  

>> ముస్లింలు జనాభాలో 27 శాతం ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల డ్రాపౌట్ శాతం 27.2 కాగా, హిందువులది 22.0. జార్ఖండ్, కర్నాటక, గుజరాత్, కేరళ, తెలంగాణ , ఢిల్లీలలో పాఠశాలల్లో ముస్లింలలో డ్రాపౌట్ రేటు ఎక్కువగా ఉంది.
 
జార్ఖండ్‌లో                ముస్లిం డ్రాపౌట్ శాతం 15.9,           హిందువుల డ్రాపౌట్ శాతం 13.4 . 

గుజరాత్‌లో               ముస్లిం డ్రాపౌట్ శాతం 26.4.           హిందు డ్రాపౌట్ శాతం 17.1,

కర్ణాటకలో                 ముస్లిం డ్రాపౌట్ శాతం 14.1,           హిందువుల డ్రాపౌట్ శాతం 13.3. 

కేరళలో                    ముస్లిం డ్రాపౌట్ శాతం 15.3 ,           హిందు డ్రాపౌట్ శాతం 14.4.

తెలంగాణలో            ముస్లిం డ్రాపౌట్ శాతం 11.3,            హిందు డ్రాపౌట్ శాతం 9.4 .   

ఢిల్లీలో                      ముస్లిం డ్రాపౌట్ శాతం 16.2,           హిందు డ్రాపౌట్ శాతం 4.3, 

ఉత్తరప్రదేశ్‌లో         ముస్లిం డ్రాపౌట్ శాతం 8.2,              హిందు డ్రాపౌట్ శాతం 6.1, 

బీహార్‌లో                  ముస్లిం డ్రాపౌట్ శాతం 13.9,            హిందు డ్రాపౌట్ శాతం 9.7


డ్రాపౌట్‌కు గల కారణాలు

డ్రాపౌట్‌కు ఆర్థిక పరిమితులు కూడా ప్రధాన కారణమని ప్రొఫెసర్ రూబియా తబస్సుమ్ అంటారు. ఆమె నివేదిక ప్రకారం.. 23.0 శాతం మంది ముస్లిం పిల్లలు ప్రాథమిక నుండి హైయ్యార్ ఎడ్యూకేషన్ వరకు డ్రాప్ అవుట్ అవుతున్నారు. అయితే హిందువులలో ఇది 18.7 శాతం మాత్రమేనని తెలిపారు. అస్సాంలో మదర్సాల మూసివేత కారణంగా డ్రాపౌట్ కారణమని అంటున్నారు. అలాగే.. ముస్లిం సమాజంలో ఆడపిల్లలకు చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం వల్ల డ్రాప్ అవుట్ సంఖ్య ఎక్కువగానే ఉందని,  ముస్లింల అభ్యున్నతి కోసం సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక నేటికీ అమలుకు నోచుకోలేదని రుబీనా తబస్సుమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత ప్రభుత్వం మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్‌ను నిలిపివేస్తే, దాని ప్రభావం ముస్లిం సమాజంపై ఎక్కువగా పడుతుందని, కర్నాటకలో బురఖా, నిఖాబ్ నిషేధించబడిందని, ఇవి కూడా డ్రాపౌట్‌ను పెంచుతుందని అన్నారు. అస్సాంలో మదర్సాలను మూసివేసిన నాటి నుంచి డ్రాపౌట్ శాతం పెరిగిందని తెలిపారు రుబీనా తబస్సుమ్.  ఆమె పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుతూ.. అక్కడ ముస్లింల శాతం 27 కంటే ఎక్కువగా ఉందని, అయితే ఈ రాష్ట్రంలో అత్యధిక డ్రాపవుట్‌లు జరుగుతున్నాయని చెప్పారు.

ముస్లిం కమ్యూనిటీలో నాయకత్వం లోపం

ముస్లింలలో నాయకత్వ లోపమే పాఠశాలల్లో పిల్లలు డ్రాపవుట్ కావడానికి అతిపెద్ద కారణమని రుబీనా భావిస్తోంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. నాయకత్వం చాలా బలహీనంగా ఉందని, విద్య గురించి మాట్లాడే వారు చాలా తక్కువ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తర్వాత.. ముస్లింలకు సరైన మార్గాన్ని చూపించే , భారతదేశంలోని ముస్లింలను విద్యతో అనుసంధానించే నాయకుడు ఎవరూ కనుగొనలేకపోయారు. ఏ విధానంలోనైనా కీలక పాత్ర పోషించగల ముస్లిం నాయకులు ఎవరూ లేరు అని పేర్కొన్నారు.

భారతదేశంలో 14.23 శాతం మంది ముస్లింలు చాలా పేదలు. ముస్లింలు ఇతర వర్గాల మాదిరిగానే సంపాదిస్తున్నారు, కానీ వారి పిల్లల చదువుకు తక్కువ ఖర్చు చేస్తున్నారు. ప్రైమరీ, మిడిల్ క్లాస్ లలో డ్రాపౌట్ ఎక్కడ జరుగుతుందో చూడాలి. మరోవైపు దేశంలో తమ జనాభా చాలా తక్కువగా ఉందని, అయితే తమ దృష్టి అంతా చదువుపైనే ఉందని.. అందుకే ఈ కమ్యూనిటీలో ఎక్కువ మంది చదువుకున్న పిల్లలు ఉన్నారని రుబీనా తబస్సుమ్ క్రిస్టియన్ వర్గాలకు తెలిపారు. ముస్లింలు కూడా విద్యపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. 

అడ్డంకులు ఎక్కడ వస్తున్నాయి?

ముస్లిం బాలికలు ఇతర సమాజ బాలికలతో పోలిస్తే చాలా బలహీనంగా ఉన్నారు. ఆడపిల్లలు ఎక్కువ చదివితే పెళ్లి జరగదనీ, వారి సమాజంలో అబ్బాయిలు పెద్దగా చదువుకోరనే భావన నేటికి ఉంది. రెండవది వివాహ వయస్సు గురించి వారు ఆందోళన చెందుతున్నారు. బాలికలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి బయటికి వెళ్లనివ్వరు.

ముస్లిం సంస్థలు ఏమి చేయాలి?

ముస్లిం పిల్లల డ్రాపౌట్‌ను అరికట్టడానికి ముస్లిం సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాలి. స్వాతంత్య్రానికి ముందు విద్యలో ఎస్సీ, ఎస్టీలు ముస్లింల కంటే చాలా దిగువన ఉండేవారు. అయితే స్వాతంత్య్రానంతరం ఈ సామాజిక వర్గంలో చాలా మార్పులు వచ్చాయి. వారిలో అక్షరాస్యత శాతం పెరిగింది. కానీ..నేటికీ కూడా ముస్లింలు వారి కంటే చాలా వెనుకబడి ఉన్నారు. ఈ విషయాన్ని ముస్లిం సంస్థలు అర్థం చేసుకోవాలి.  విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్న ముస్లిం సంస్థలు వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి. విద్య వల్ల కలిగే లాభాలను సవివరంగా వివరించాలి. అలాగే.. ఎక్కడ మదర్సాలు ఉన్నాయో అక్కడ  ఆధునిక విద్యను అందించాలి. యూపీలో ముస్లిం డ్రాపౌట్ తక్కువగా ఉంది. దానికి కారణం మదర్సాలే. అక్కడ అమ్మాయిలకు కూడా విద్యనందిస్తున్నారు. 

రచయిత : మహ్మద్ అక్రమ్   (న్యూఢిల్లీ)

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు