Goa Assembly Elections : ఆదివాసీ మహిళలతో ప్రియాంకాగాంధీ డ్యాన్స్..

Published : Dec 11, 2021, 09:36 AM IST
Goa Assembly Elections : ఆదివాసీ మహిళలతో ప్రియాంకాగాంధీ డ్యాన్స్..

సారాంశం

ప్రియాంక గాంధీ వాద్రా గోవా రాష్ట్ర పర్యటనతో.. గోవాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంక అక్కడ తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా 'మాంద్' మోర్పిర్ల గ్రామంలో గోవాలోని గిరిజన సంఘం మహిళలతో కలిసి నృత్యం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉద్యోగాల్లో 30% కోటా కల్పిస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.

న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం గోవాలో ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం (డిసెంబర్ 10) ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని మోర్పిర్ల గ్రామంలో గిరిజన మహిళలతో కలిసి జానపద నృత్యం చేశారు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్ విడుదల చేసిన ఓ వీడియోలో, ప్రియాంక గాంధీ వాద్రా స్థానిక ప్రచార కార్యక్రమంలో జానపద పాటపై నృత్యం చేస్తున్న కొంతమంది గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేయడం, నృత్యం చేయడం చూడవచ్చు.

ప్రియాంక గాంధీ వాద్రా గోవా రాష్ట్ర పర్యటనతో.. గోవాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంక అక్కడ తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా 'మాంద్' మోర్పిర్ల గ్రామంలో గోవాలోని గిరిజన సంఘం మహిళలతో కలిసి నృత్యం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉద్యోగాల్లో 30% కోటా కల్పిస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.

ఈ వీడియోలో గులాబీ రంగు చీర ధరించిన ప్రియాంక ఈ మహిళలతో కలిసి కాసేపు సరదాగా డ్యాన్స్ చేసింది. వారితో కలిసి వారు చెప్పినట్టుగా పాదాలు కలుపుతూ నృత్యం చేసింది. మిగతా మహిళలు తలపై కుండతో నృత్యం చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 45 సెకన్ల నిడివి గల డ్యాన్స్ వీడియోకు ఇప్పటికే 45 వేలకు పై చిలుకు మంది చూశారు. గోవాలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్న వాద్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ఈవెంట్ నుండి కొన్ని ఫొటోలు షేర్ చేశారు. వీటిని షేర్ చేస్తూ ఆమె గిరిజన మహిళలను 'strong and confident' అని అభివర్ణించారు.

అయితే ప్రియాంక వాద్రా గిరిజన మహిళల పాటలకు డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో, కాంగ్రెస్ నాయకురాలు అస్సాంలో పర్యటించినప్పుడు టీ తోటల్లో పనిచేసే ఆదివాసీ టీనేజ్ అమ్మాయిలతో కలిసి ప్రసిద్ధ జానపద నృత్యం ‘ఝుమూర్’ డ్యాన్స్ చేశారు.

ఇదిలా ఉండగా, గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రియాంకా గాంధీ వాద్రా హామీ ఇచ్చారు.అక్వెమ్‌లో జరిగిన "ప్రియదర్శిని" మహిళా సదస్సులో ప్రియాంక మాట్లాడుతూ, "గోవా ప్రసిద్ధ tourism destination. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు గోవాకు వస్తారు. ఇంత ప్రాముఖ్యత ఉన్నా కోవిడ్ 19 మహమ్మారి సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంలోని వారికి ఎలాంటి సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?