మీ పిల్లలు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతున్నారా?... పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే.. కేంద్రం మార్గదర్శకాలు..

Published : Dec 11, 2021, 09:13 AM IST
మీ పిల్లలు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతున్నారా?... పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే.. కేంద్రం మార్గదర్శకాలు..

సారాంశం

COVID-19 మహమ్మారి ప్రభావంతో స్కూల్స్ మూసేయడం, ఆన్ లైన్ క్లాసుల పేరుతో పిల్లలకు మొబైల్, ఇంటర్నెట్ వినియోగం బాగా దగ్గరయ్యింది. దీంతో పిల్లల్లో ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం పెరిగిపోతోంది. దీంతో అనేక రకాల మానసిక, శారీరక సమస్యలు ఎదురవుతున్నాయి. దీన్ని నివారించేందుకు MoE ద్వారా "చిల్డ్‌రెన్స్ సేఫ్ ఆన్‌లైన్ గేమింగ్"పై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కొన్ని సలహాలు, సూచనలు జారీ చేయబడ్డాయి. 

న్యూఢిల్లీ : తల్లిదండ్రుల అనుమతి లేకుండా Online Games ను కొనడాన్ని అనుమతించకపోవడం, సబ్‌స్క్రిప్షన్‌ల కోసం యాప్‌లలో క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల రిజిస్ట్రేషన్‌లను నివారించడం, స్క్రీన్ మీద అసలు గుర్తింపు కాకుండా అవతార్ లాంటి వాటిని ఉపయోగించడం...మానిటరింగ్, లాగింగ్ వంటి ఫీచర్‌లతో ఇంటి వద్ద ఇంటర్నెట్ గేట్‌వేని ఇన్‌స్టాల్ చేయడం. పిల్లలకు ఎలాంటి గేమ్ లకు యాక్సెస్ ఉన్నారు అనేదాన్ని, ఆ   కంటెంట్ రకాలను నియంత్రించడం లాంటి వాటి విషయంలో.. సురక్షితమైన ఆన్‌లైన్ గేమింగ్‌పై Ministry of Education కొన్ని advisory జాబితా విడుదల చేసింది. ఆ  జాబితా ప్రకారం.. ఆన్ లైన్ గేమ్స్ విషయంలో  చేయవలసినవి, చేయకూడనివి ఏమిటంటే.. 

COVID-19 మహమ్మారి ప్రభావంతో స్కూల్స్ మూసేయడం, ఆన్ లైన్ క్లాసుల పేరుతో పిల్లలకు మొబైల్, ఇంటర్నెట్ వినియోగం బాగా దగ్గరయ్యింది. దీంతో పిల్లల్లో ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం పెరిగిపోతోంది. దీంతో అనేక రకాల మానసిక, శారీరక సమస్యలు ఎదురవుతున్నాయి. దీన్ని నివారించేందుకు MoE ద్వారా "చిల్డ్‌రెన్స్ సేఫ్ ఆన్‌లైన్ గేమింగ్"పై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కొన్ని సలహాలు, సూచనలు జారీ చేయబడ్డాయి. 

దీనిద్వారా పిల్లలు ఆన్ లైన్ గేమ్ ల వ్యవసనాలకు లోనవ్వకుండా తీసుకోవాల్సిన అవసరమైన చర్యల మీద వారికి అవగాహన కల్పించడం ద్వారా, పిల్లలకు సంబంధించిన మానసిక, శారీరక ఒత్తిడితో కూడిన అన్ని ఆన్‌లైన్ గేమింగ్ ప్రతికూలతలను అధిగమించడంలో సమర్థవంతమైన ఉపయోగాన్ని నిర్ధారించడం దీని ప్రధాన ఉద్దేశం.

"గేమ్‌లు ఆడటం అనేది గేమింగ్ డిజార్డర్‌గా పరిగణించబడే తీవ్రమైన గేమింగ్ వ్యసనానికి దారి తీస్తుంది. ఈ ఆన్ లైన్ గేమ్స్ లో ఒక్కో స్తాయి పెరుగుతున్న కొద్దీ ప్రతి స్థాయి మునుపటి కంటే చాలా క్లిష్టంగా ఉండే విధంగా రూపొందించబడింది. దీని వలన గేమ్ ఆడే ఆటగాళ్లు ఎలాగైనా ఆ లెవెల్ దాటాలని, గేమ్ లో ముందుకు వెళ్లాలని తమను తాము పరిమితిలోకి నెట్టడం జరుగుతుంది. 

"అందుకే, ఎలాంటి నిబంధనలు, స్వీయ-పరిమితులు మరిచిపోయి..లేదా లేకుండా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటం వలన చాలా మంది ఆటగాళ్ళు వ్యసనానికి గురవుతారు. దీంతో ఇది అంతిమంగా గేమింగ్ డిజార్డర్‌ కు దారి తీస్తుంది. గేమింగ్ కంపెనీలు కూడా మానసికంగా పిల్లలను మరిన్ని స్థాయిలను కొనుగోలు చేయమని ఒత్తిడి చేస్తాయి. యాప్‌లో కొనేలా బలవంతం చేస్తాయి" అని అడ్వైజరీ గమనించింది. 

తల్లిదండ్రుల సమ్మతి లేకుండా గేమ్‌లో కొనుగోళ్లను అనుమతించకపోవడం, RBI మార్గదర్శకాల ప్రకారం OTP ఆధారిత చెల్లింపు పద్ధతులను అనుసరించడం, సబ్‌స్క్రిప్షన్‌ల కోసం యాప్‌లలో క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల రిజిస్ట్రేషన్‌ను నివారించడం, ప్రతి లావాదేవీకి ఖర్చుపై గరిష్ట పరిమితిని విధించడం, పిల్లలను నేరుగా ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ద్వారా కొనుగోలు చేయనివ్వకపోవడం లాంటివి... గేమింగ్ సలహా జాబితాలో చేయ "కూడనివి" వాటిల్లో కొన్ని. 

"తెలియని వెబ్‌సైట్‌ల నుండి సాఫ్ట్‌వేర్, గేమ్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని పిల్లలకు సూచించాలి. వెబ్‌సైట్‌లలోని లింక్‌లు, ఫొటోలు, పాప్-అప్‌లను క్లిక్ చేసేముందు జాగ్రత్త గా ఉండాలని, ఏ లింక్ పడితే వాటిమీద క్లిక్ చేయద్దని... కొన్ని జాగ్రత్తలు వారికి చెప్పాలి.  ఎందుకంటే వాటిల్లో వైరస్‌ ఉండవచ్చు. వాటితో కంప్యూటర్‌ పాడు కావచ్చు. లేదా పిల్లలు చూడకూడని కంటెంట్‌ ఏదైనా ఉండవచ్చు" అనేది ఇంకో సలహా సిఫార్సు చేయబడింది.

"గేమ్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు లేదా గేమింగ్ ప్రొఫైల్‌లను రూపొందించేటప్పుడు ఇంటర్నెట్‌లో వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకూడదని పిల్లలకు సలహా ఇవ్వాలి. వెబ్ క్యామ్, ప్రైవేట్ మెసేజింగ్ లేదా ఆన్‌లైన్ చాట్ ద్వారా పెద్దలతో సహా అపరిచితులతో కమ్యూనికేట్ చేయవద్దని వారికి సలహా ఇవ్వండి. దీనివల్ల ఆన్‌లైన్ ఫ్రాడ్, లేదా ఇతర ఆటగాళ్ల నుండి బెదిరింపులను నివారించవచ్చు" అని అది పేర్కొంది.

ఆరోగ్య అంశాలు, వ్యసనంగా మారే ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని, విరామం తీసుకోకుండా ఎక్కువ గంటలు గేమ్స్ ఆడకుండా ఉండాలని పిల్లలకు సలహా ఇవ్వాలని కూడా సిఫార్సు చేయబడింది.

"ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నప్పుడు, ఏదైనా తప్పు జరిగితే, వెంటనే ఆపివేసి, స్క్రీన్‌షాట్ (కీబోర్డ్‌లోని 'ప్రింట్ స్క్రీన్'' బటన్‌ని ఉపయోగించి) తీసి, దాన్ని చెప్పమని పిల్లలకు చెప్పాలి. ఆన్‌లైన్‌లో మీ పిల్లలు వారి గోప్యతను కాపాడుకోవడానికి వారికి సహాయపడండి. దానికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్పండి. వారి అసలు పేరును చెప్పుకుండా స్క్రీన్ పేరు ఉపయోగించడానికి, MoE సలహాలో సిఫార్సు చేయబడిన "చేయవలసినవి" వాటిలో ఉన్న వాటిని పాలో అవ్వండి.

"యాంటీవైరస్, స్పైవేర్ ప్రోగ్రామ్‌లను ఉపయోగించండి. ఫైర్‌వాల్‌ని ఉపయోగించి వెబ్ బ్రౌజర్‌లను సురక్షితంగా కాన్ఫిగర్ చేయండి. తల్లిదండ్రుల నియంత్రణలు, భద్రతా ఫీచర్‌లను పరికరంలో లేదా యాప్ లేదా బ్రౌజర్‌లో యాక్టివేట్ చేయండి, ఇది నిర్దిష్ట కంటెంట్‌కు యాక్సెస్‌ని పరిమితం చేయడంలో,  గేమ్‌లో కొనుగోళ్లపై ఖర్చును పరిమితం చేయడంలో సహాయపడుతుంది," అని కూడా పేర్కొంది.

మీ పిల్లలు ఆడుతున్న ఏవైనా గేమ్‌లు ఏ వయసు వారు ఆడేవి, వాటి రేటింగ్‌ను తనిఖీ చేయడం, ఫ్యామిలీ కంప్యూటర్ నుండి మాత్రమే మీ చిన్నారికి ఇంటర్నెట్‌ యాక్సెస్ ఉందని నిర్ధారించుకోవడం, అపరిచితులు లేదా ఏదైనా అనుచితమైన దాని గురించి ఎవరైనా చాట్ చేయాలని చూసినా, మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా.. వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతున్నా వెంటనే పిల్లలు రెస్పాండ్ అవ్వకుండా తల్లిదండ్రులు లేదా కేర్ టేకర్లు, ఇంట్లోని పెద్దలకు తెలియజేయమని పిల్లలకు చెప్పాలి.

"ఒకవైళ ఎవరైనా బెదిరిస్తున్నట్లైతే..  వెంటనే ప్రతిస్పందించొద్దని చెప్పాలి. హరాస్మెంట్ చేస్తుంటే అలాంటి మెసేజ్ లను రికార్డ్ చేయండి. ఈ బిహేవియర్ ను గేమ్ సైట్ నిర్వాహకులకు తెలపాలి. వారి ఆటగాళ్ల జాబితా నుండి ఆ వ్యక్తిని బ్లాక్ చేయండి, మ్యూట్ చేయండి లేదా "అన్‌ఫ్రెండ్" చేయండి లేదా గేమ్‌లో చాట్‌ను ఆఫ్ చేయండి’’.. అని చెప్పండి.

ఒమిక్రాన్ వేరియంట్ : మహారాష్ట్రలో అలజడి, వెలుగులోకి మరో 6 కేసులు.. భారత్‌లో 32కి చేరిన సంఖ్య

"మీ పిల్లలు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు.  వారు ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నారు అనే దాని గురించి మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మీ పిల్లలతో కలిసి గేమ్స్ ఆడండి. ఆన్‌లైన్ గేమ్‌లలోని కొన్ని ఫీచర్‌లు ఎక్కువ ఆడటం, మనతో డబ్బులు ఖర్చు పెట్టించడం కోసం ఎలా ఉపయోగించబడుతున్నాయో మీ పిల్లలకు అర్థం అయ్యేలా చేయడంలో సహాయపడండి. gambling గురించి వారితో మాట్లాడండి. అది ఏమిటి? ఆన్‌లైన్‌లో, భౌతిక ప్రపంచంలో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అని వారికి అర్థమయ్యేలా చెప్పండి" అని సూచించబడింది. 

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ ఆన్‌లైన్ యాక్టివిటీకి సంబంధించి ఏదైనా అనుమానించేలా కనిపించినా, ఆన్‌లైన్‌లో ముఖ్యంగా సోషల్ మీడియాలో గడిపే సమయం సడెన్ గా పెరిగినట్టు అనిపించినా, మీ డివైజ్ లలో స్క్రీన్‌లను మార్చినట్లు అనిపిస్తే.. ఇలాంటి సందర్భాల్లో ఆ గేమ్ లనుంచి మీరు ఉపసంహరించుకోవడమే మంచిదని కూడా అడ్వైజరీ సూచించింది. 

"పిల్లలు యాక్సెస్ చేయగల కంటెంట్ రకాలను పర్యవేక్షించడం, లాగింగ్ చేయడం, నియంత్రించడం వంటి ఫీచర్లు ఉన్న ఇంటర్నెట్ గేట్‌వేని ఇంట్లోని కంప్యూటర్ లో ఇన్‌స్టాల్ చేయండి. ఉపాధ్యాయులు స్టూడెంట్స్ లో పడిపోతున్న గ్రేడ్‌లు, విద్యార్థుల సోషల్ బిహేవియర్ పై నిఘా ఉంచాలి. ఉపాధ్యాయులకు ఏ మాత్రం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే అప్రమత్తమై పాఠశాల అధికారులకు సమాచారం అందించాలి.

"ఇంటర్నెట్ లాభాలు, నష్టాల గురించి పిల్లలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు నిర్ధారించుకోవాలి. ఉపాధ్యాయులు వెబ్ బ్రౌజర్‌లు, వెబ్ అప్లికేషన్‌ల సురక్షిత కాన్ఫిగరేషన్ కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి" అని కూడా అడ్వైజరీ సూచించింది. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్