జోరుగా సాగుతోన్న భారత్ జోడో యాత్ర.. ప్రియాంక గాంధీ ఎంట్రీ రేపే.. 

By Rajesh KarampooriFirst Published Nov 22, 2022, 12:16 PM IST
Highlights

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం నుండి భారత్ జోడో యాత్ర లో చేరనున్నారు. ఆమె తన  రాహుల్ గాంధీతో కలిసి నాలుగు రోజుల పాటు కలిసి నడవనున్నారు.ఈ మేరకు మంగళవారం ఉదయం పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు.

భారత్ జోడో యాత్ర: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం నుండి భారత్ జోడో యాత్ర లో చేరనున్నారు. మధ్యప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొననున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు. జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. 'ఈరోజు భారత్ జోడో యాత్రకు విశ్రాంతి దినం. రేపు మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ సమీపంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 4 రోజుల పాటు యాత్రలో పాల్గొంటారు. సెప్టెంబర్ 7న ప్రారంభమైన 'భారత్ జోడో యాత్ర'లో ప్రియాంక గాంధీ ఇంకా పాల్గొనలేదు. గతంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022లో ఆమె పార్టీ ప్రచారంలో బిజీగా ఉన్నారు.

జోడో యాత్రలో సోనియా గాంధీ 

జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలోని మాండ్యాలో రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు ఈ యాత్రను సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభించారు. వారు 3570 కిలోమీటర్ల దూరం ప్రయాణించి శ్రీనగర్ చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఈ ప్రయాణం ముగుస్తుంది.

నవంబర్ 23న మధ్యప్రదేశ్ లోకి 

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నవంబర్ 23న మధ్యప్రదేశ్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్ర బుర్హాన్‌పూర్ నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. అయితే.. ఈ యాత్ర షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేశారు. ముందుగా రాహుల్ గాంధీ నవంబర్ 27న డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జన్మస్థలమైన మోవ్‌కు వెళ్తున్నారని భావించారు. కానీ, ఇప్పుడు అది 26 నే మోహౌకు చేరుకుంటుంది. దీంతో పాటు రాహుల్ మహాకాళ్ దర్శన కార్యక్రమంలో కొంత మార్పు చేశారు. అంతకుముందు డిసెంబర్ 1వ తేదీన ఉజ్జయినిలోని మహాలకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. అంతకంటే.. ఒకరోజు ముందుగానే ఉజ్జయిని చేరుకోనున్నారు.
 

click me!