లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

Published : Nov 22, 2022, 10:57 AM IST
లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫోర్ వీలర్ వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో ఐదుగురు మృతి చెందారు. 

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫోర్ వీలర్ వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. షాజహాన్‌పూర్ నుంచి కూలీలతో వెళ్తున్న కారు..  పాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే క్రాసింగ్ సమీపంలో అదుపు తప్పి లోయాలో పడింది. ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 10 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లఖింపూర్ ఖేరీలోని భీరా రోడ్డుపై ఫోర్ వీలర్ వాహనం బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించినట్టుగా చెప్పారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ