"ప్రజలే భవిష్యత్తును నిర్ణయిస్తారు..": రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు  

Published : May 14, 2023, 02:50 AM IST
"ప్రజలే భవిష్యత్తును నిర్ణయిస్తారు..": రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు  

సారాంశం

ప్రతిపక్షాలు వాస్తవ సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్నాయని ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ప్రజల సమస్యలపై మాట్లాడకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించే రాజకీయాలు ఇకపై ఈ దేశంలో పనిచేయవని ఆమె అన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 137 సీట్లు గెలుచుకుని అఖండ మెజారిటీ సాధించింది. బీజేపీకి 65 సీట్లు వచ్చాయి. ఈ విజయం తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా చేయడంపై మీడియా ప్రశ్నలు సంధించింది. దీనిపై ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ.. ప్రజలే భవిష్యత్తును నిర్ణయిస్తారని అన్నారు.
 
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా చేయాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. “కర్ణాటకలో అధికారంలోకి రావడం చాలా పెద్ద బాధ్యత. మేము కొన్ని హామీలతో ప్రజల వద్దకు వెళ్లాం.. వాటిని నెరవేర్చాము. మనం ప్రజల కోసం పని చేయాలి. తరువాత ఏమి జరుగుతుందో ప్రజలే చెబుతారు." అని అన్నారు. 

అసలు సమస్యలపై విపక్షాలు దృష్టి మళ్లిస్తున్నాయని ఆరోపించారని.  ప్రియాంక ఆరోపించారు.ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారనీ, ప్రజల సమస్యలపై మాట్లాడకుండా చేసే రాజకీయాలు ఇక పనికిరావని అన్నారు. హిమాచల్‌లోనూ ఇదే పరిణామాన్ని చూశామని తెలిపారు.   

కర్నాటక ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ఆదేశం అని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ విజయం మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.  అంతకుముందు శనివారం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. కర్నాటకలో విద్వేషాల మార్కెట్‌ మూతపడింది. ఇప్పుడు ప్రేమ దుకాణాలు తెరుచుకున్నాయని రాహుల్‌ గాంధీ అన్నారు.

ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో మీడియాతో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. 'పేదలకు కాంగ్రెస్‌ అండగా నిలుస్తోంది. ఈ ఎన్నికల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే.. మనం ద్వేషంతో పోరాడలేదు. ప్రేమతో ఎన్నికల్లో పోరాడాం." అని అన్నారు. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు 'భారత్ జోడో యాత్ర'  ప్రత్యక్ష ప్రభావమని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అన్నారు. ఈ యాత్ర కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకవస్తుందని ఆశించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్