కాంగ్రెస్‌ పార్టీలో కరోనా కలకలం.. మరోసారి ప్రియాంకకు పాజిటివ్.. మూడు నెలల్లో రెండో సారి..

By Sumanth KanukulaFirst Published Aug 10, 2022, 11:18 AM IST
Highlights

కాంగ్రెస్‌ పార్టీలో కరోనా కలకలం రేపుతోంది. మంగళవారం కాంగ్రెస్‌ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 

కాంగ్రెస్‌ పార్టీలో కరోనా కలకలం రేపుతోంది. మంగళవారం కాంగ్రెస్‌ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ బుధవారం ప్రకటించారు. తనకు మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టుగా చెప్పారు. అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తున్నాని తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టుగా ట్వీట్ చేశారు. 

అయితే మూడు నెలల వ్యవధిలో ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడం ఇది రెండో సారి. ఈ ఏడాది జూన్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన ఒక్క రోజు తర్వాత.. ప్రియాంకకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు.. ‘‘ఈ రోజు కోవిడ్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయింది  (మళ్ళీ!) ’’ అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. 

ఇక, మంగళవారం సాయంత్రం తనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్టుగా మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. “నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇటీవల నన్ను కలిసినవారు జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాను’’ అని ఖర్గే ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. భారతదేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,047 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం  కరోనా కేసుల సంక్య 4,41,90,697కి చేరింది. ఈ మేరకు బుధవారం ఉదయం  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాను విడుదల చేసింది. తాజాగా కరోనాతో 54 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 5,26,826 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,28,261 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.52 శాతంగా, రోజువారి పాజిటివిటీ రేట్ 4.94 శాతం, వీక్లీ పాజిటివిటీ రేట్ 4.90 శాతంగా ఉంది. 

click me!