Azadi Ka Amrut Mahotsav : ఇంటిపై జెండా ఎగురవేస్తున్నారా? అయితే వీటిని ఖచ్చితంగా పాటించాల్సిందే...

By Bukka SumabalaFirst Published Aug 10, 2022, 11:15 AM IST
Highlights

ఇంటిమీద జాతీయ జెండాను ఎగురవేయాలంటే.. సరదా కాదు, బాధ్యత. అంతేకాదు.. త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాడానికి నియమాలు కూడా ఉన్నాయి. వాటికి ఖచ్చితంగా పాటించాల్సిందే. 

హైదరాబాద్ : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రతీ ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. హర్ ఘర్ తిరంగా యాత్రను కూడా ప్రారంభించింది. ఈ మేరకు ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కూడా చేస్తోంది ప్రభుత్వం. మువ్వన్నెల పతాక రెపరెపలతో జాతీయ పండుగను ఘనంగా జరపాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దేశ ప్రజలంతా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా డీపీలను జెండాతో మార్చి.. దేశం మీదున్న ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. 

ఇంటిమీద జాతీయ జెండా, త్రివర్ణ పతాకం ఎగురవేయాలనుకోవడం మంచిదే.. అయితే దానికి కొన్ని నియమనిబంధనలను ఉన్నాయి. జాతీయ జెండాను ఉపయోగించే సమయంలో ఫ్లాగ్ కోడ్ 2002 నిబంధలను తప్పనిసరిగా పాటించాలి. జెండాను ఉపయోగించే విధానంలో తెలిసో, తెలియకో ఫ్లాగ్ కోడ్ ను ఉల్లంఘించినట్లైతే.. చట్టంలో ఉన్న ప్రకారం శిక్షలు, జరిమానాలు విధిస్తారు. నిబంధనలకు వ్యతిరేకంగా జాతీయ జెండాను అవమానపరిచినా, అగౌరపరిచినా మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. 

బ్యూరోక్రాట్లు మంత్రులు చెప్పిన‌ట్టే వినాలి. ‘ఎస్ సర్’ మాత్రమే అనాలి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఆ నియమాలు ఇవే...

జాతీయ జెండాను అత్యంత గౌరవంగా చూసుకోవాలి. జెండాను ఎగురవేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అది చిరిగిపోయి, నలిగిపోయి, పాతగా అయిపోయి ఉండకూడదు. 

- మూడు వర్ణాలు, అశోక చక్రం తప్ప మరే వర్ణాలు, రాతలు ఉండకూడదు. 

- కాషాయ రంగు పైకి, ఆకుపచ్చ రంగు కిందికి ఉండాలి. నిలువుగా ప్రదర్శించేసమయంలో కాషాయం రంగు ఎడమవైపుకు ఉండాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగబడిన జెండాను ఎగరవేయకూడదు.

- జెండా వందన సమయంలో త్రివర్ణ పతాకానికి సరిసమానంగానూ, దానికన్నా ఎత్తులోనూ మరే ఇతర జెండాలు ఉండకూడదు.

- జాతీయ జెండాను నేలమీద అగౌరవంగా పడేయకూడదు. వివిధ అలంకరణ సామాగ్రిగా జాతీయ జెండాను ఉపయోగించకూడదు.

- పబ్లిక్ మీటింగుల్లో, సమావేశాల్లో స్టేజ్ మీద కుడివైపున మాత్రమే అంటే ప్రేక్షకులకు ఎడమ వైపుగా అన్నట్లు.. జెండాను నిలపాలి.

- జెండా మీద ఎలాంటి అలంకరణలు, పూలు పెట్టకూడదు. పతాకం మధ్యలో పూలను వాడచ్చు. 

- వస్తువులు, భవనాల మీద జెండాను కప్పకూడదు. దుస్తులుగా కుట్టించుకోకూడదు. 

click me!