విద్యుత్ డిస్కంల ప్రైవేటీకరణ: నిర్మల సీతారామన్ సంచలన ప్రకటన

By Sree s  |  First Published May 16, 2020, 6:42 PM IST

కేంద్రపాలితప్రాంతాల్లో ఉన్న పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నిటిని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు నిర్మల సీతారామన్ అన్నారు. అందుకు సంబంధించిన టారిఫ్ విధానాన్ని ప్రభుత్వం త్వరలోనే తీసుకువస్తుందని ఆమె తెలిపారు. 


భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో సామాజికంగా అవసరమైన మౌలికసదుపాయాలైన ఆసుపత్రులవంటి వాటిపై మరింతగా ఖర్చు పెంచాల్సిన వసరమవుందని, ఇందుకోసమని 8100 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆమె తెలిపారు. 

సాధారణంగా ప్రభుత్వాలు స్పాన్సర్ చేసే ప్రాజెక్టుల్లో 20 శాతం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గా ఉంటుందని, కానీ ఇక్కడ ఈ సామజిక మౌలిక వస్తలుల ఏర్పాటు కోసం దాన్ని 30 శాతానికి పెంచుతున్నట్టు ఆమె తెలిపారు. ఇలా 10 శాతం పెంచడం వల్ల ప్రైవేట్ సంత్సహాలు కూడా ముందుకు వస్తాయని ఆమె అన్నారు. 

Latest Videos

ఇక స్పేస్ విషయం గురించి మాట్లాడుతూ.... ఇస్రో వంటి సంస్థలు భారతదేశానికి ఎన్నో కీర్తిపతాకాలను తెచ్చి పెట్టిందని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. స్పేస్ భాగస్వామ్యంలో ప్రభుత్వ రంగ ఇస్రో తోపాటుగా ప్రైవేట్ వారిని కూడా పూర్తి భాగస్వాములను చేయనున్నట్టు ఆమె తెలిపారు. 

సాటిలైట్ ప్రయోగాల నుంచి మొదలు ఇతర అన్ని స్పేస్ కు సంబంధించిన విషయాల్లో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పించనున్నట్టు ఆమె తెలిపారు. ఇక అణుశక్తి రంగం విషయానికి వస్తే... పీపీపీ మోడల్ లో మెడికల్ ఫీల్డ్ లో వాడే ఐసోటోపులను అభివృద్ధి చేయనున్నట్టు ఆమె తెలిపారు. 

ఆహార ధాన్యాలను మరింతగా నిల్వ ఉంచే ఫుడ్ ఇర్రడియేషన్ పద్దతిని మరింతగా పెంపొందించేందుకు పీపీపీ మోడల్ లో అందుకు అవసరమైన మరిన్ని కేంద్రాలను పీపీపీ మోడల్ లో ఏర్పాటు చేయనున్నట్టు నిర్మల సీతారామన్ అన్నారు. 

ఇక కేంద్రపాలితప్రాంతాల్లో ఉన్న పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నిటిని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు నిర్మల సీతారామన్ అన్నారు. అందుకు సంబంధించిన టారిఫ్ విధానాన్ని ప్రభుత్వం త్వరలోనే తీసుకువస్తుందని ఆమె తెలిపారు. 

డిస్ట్రిబ్యూషన్ కంపెనీల లోటుపాట్లు, వారి అసమర్థత ప్రజలమీద భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆమె అన్నారు.  డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వారి బిల్లులను చెల్లించలేకపోతేనే ప్రభుత్వం వారికి చెల్లించిందని ఆమె అన్నారు. 

అసలే విద్యుత్ అనేది కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి జాబితా. చూడబోతుంటే... విద్యుత్ కు సంబంధించి త్వరలోనే రాష్ట్రాలకు కేంద్రం షాక్ ఇవ్వనున్నట్టు అర్థమవుతుంది. 

click me!