రక్షణ రంగంలో సమగ్ర మార్పులు, స్వదేశీ మీదే ప్రధాన ఫోకస్: ఆర్ధిక మంత్రి

By Sree s  |  First Published May 16, 2020, 5:27 PM IST

రక్షణ రంగంలో సంస్కరణల గురించి మాట్లాడుతూ ఆర్ధిక మంత్రి మేక్ ఇన్ ఇండియా గురించి ప్రస్తావించారు. స్వయం సమృద్ధిగా ఉండాలంటే.... మేక్ ఇన్ ఇండియా అనేది అత్యంత ఆవశ్యకమని ఆమె అన్నారు. రక్షణ రంగంలో ఇది అవసరమని ఆమె అన్నారు. 


రక్షణ రంగంలో సంస్కరణల గురించి మాట్లాడుతూ ఆర్ధిక మంత్రి మేక్ ఇన్ ఇండియా గురించి ప్రస్తావించారు. స్వయం సమృద్ధిగా ఉండాలంటే.... మేక్ ఇన్ ఇండియా అనేది అత్యంత ఆవశ్యకమని ఆమె అన్నారు. రక్షణ రంగంలో ఇది అవసరమని ఆమె అన్నారు. 

కానీ రక్షణ రంగంలో హైటెక్ పరికరాలు కొన్ని అవసరమని, దేశ రక్షణ విషయంలో అది అత్యంత ఆవశ్యకమని ఆమె అన్నారు. సాధ్యమయ్యే చోట, మన పరికరాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి అని అన్నచోట వాటిని వాడుతామని ఆమె చెప్పారు. 

Latest Videos

ఆర్మీ ఉన్నతాధికారులతో, డిపార్ట్మెంట్ అఫ్ మిలిటరీ అఫైర్స్ తో మాట్లాడిన తరువాత కొన్ని ఆయుధాలు, రక్షణ ప్లాటుఫారాల దిగుమతిని అనుమతించబోమని ఆమె తెలిపారు. ఎక్కడెక్కడైతే, ఏయే పరికరాల్లో అయితే... భారత్ స్వయం సమృద్ధి సాధించిందో... వాటి దిగుమతిని ఇక అనుమతించబోమని ఆమె ఈ సందర్భంగా అన్నారు. 

ప్రతిసంవత్సరం ఈ లిస్టులో మార్పులుచేర్పులు చోటుచేసుకుంటాయని ఆమె అన్నారు. ఇలా దిగుమతి ఆపేసి, భారత్ లోనే తయారయ్యే వాటినే రక్షణ ఉత్పత్తులను తయారుచేసే సంస్థలన్నీ వాడలిసి ఉంటుందని రక్షణ మంత్రి తెలిపారు. ఇలా చేయడం వల్ల దిగుమతుల మీద చెల్లించే ఖర్చును చాలావరకు తగ్గించుకోవచ్చని, విదేశీ మారకం మిగులుతుందని ఆమె ఈ సందర్భంగా అన్నారు. 

రక్షణ రంగంలో ఆటోమేటిక్ రూట్ ద్వారా విదేశీ పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతున్నట్టు ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. విదేశీ టెక్నాలజీలను, పరికరాలను భారత్ లో ఉత్పత్తి చేసేందుకు కూడా తాము అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్టు ఆమె ఈ సందర్భంగా అన్నారు. 

ఇక ఆర్డినెన్సు ఫ్యాక్టరీల్లో కూడా కార్పొరేట్ తరహా పనితీరు తీసుకొస్తామని, అవి మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ పనిని చేస్తున్నట్టు ఆర్ధిక మంత్రి ఈ విషయం తెలిపారు. ఇక మీదట సామాన్య ప్రజలు కూడా ఆ ఫ్యాక్టరీల్లో షేర్స్ కొనుగోలు చేయొచ్చని ఆర్ధిక మంత్రి అన్నారు. 

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా నేడు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న నిర్మల సీతారామన్   నేటి ప్రెస్ మీట్ లో ఫోకస్ అంతా మౌలిక నిర్మాణాత్మకమైన సంస్కరణల మీదనే ఉండబోతుందని తెలిపారు. 

పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించే రంగాల్లో సంస్కరణలను చేయడానికి పూనుకున్నామని, అందువల్ల ఆర్ధిక ప్రగతి సాధించడంతోపాటుగా ఉద్యోగావకాశాలను కూడా పెంపొందిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. 

గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ప్రసుత్తవన తరువాత నేటి సంస్కరణల గురించి మాట్లాడారు. నేటి పేస్ కాన్ఫరెన్స్ లో ఎనిమిది రంగాల గురించి ప్రస్తావించనున్నట్టు ఆర్ధిక మంత్రి చెప్పారు. 

click me!