దొంగలు, నేరస్తుల దేవాలయం.. సంకెళ్లతో పూజలు

First Published 30, Aug 2018, 5:06 PM IST
Highlights

దేశంలో అన్ని మతాలకు, కులాలకు, వర్గాలకు విడి విడిగా దేవాలయాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వివిధ నేరాల్లో దోషులుగా తేలి శిక్షలు అనుభవిస్తున్న నేరస్తులకు దేవాలయం ఉన్న సంగతి తెలుసా..? 

దేశంలో అన్ని మతాలకు, కులాలకు, వర్గాలకు విడి విడిగా దేవాలయాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వివిధ నేరాల్లో దోషులుగా తేలి శిక్షలు అనుభవిస్తున్న నేరస్తులకు దేవాలయం ఉన్న సంగతి తెలుసా..?

మధ్యప్రదేశ్‌లోని నీమచ్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాలీనెర్ గ్రామంలోని ఖాఖర్‌దేవ్ మందిరం ఎంతో ప్రత్యేకమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఆలయానికి సాధారణ భక్తులతో పాటు నేరస్తులు, దొంగలు కూడా తరలివచ్చి పెద్దఎత్తున పూజలు చేస్తుంటారు.

వివిధ నేరాల్లో శిక్ష పడిన వారు జైలు జీవితం నుంచి, నేరాల నుంచి విముక్తి కల్పించమని ఇక్కడి దేవుణ్ని కోరుకుంటూ ఉంటారు. ఇందుకు గాను చేతి సంకెళ్లు సమర్పిస్తూ ఉంటారు.. సుమారు 50 ఏళ్ల కాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతున్నట్లు ఆలయ పూజారి చెబుతున్నారు. 
 
Last Updated 9, Sep 2018, 11:38 AM IST