తిహార్ జైలులో మొబైల్ మింగేసిన ఖైదీ.. ఇంకా కడుపులోనే సెల్ ఫోన్

By Mahesh KFirst Published Jan 7, 2022, 4:13 PM IST
Highlights

తిహార్ జైలులోని ఒకటో నెంబర్ గదిలో ఓ ఖైదీ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో జైలు అధికారులు సోదా చేయడానికి వెళ్లారు. ఇది గమనించి వెంటనే ఆ ఖైదీ తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్‌ను మింగేశాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆయనను హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. కానీ, ఆ సెల్ ఇంకా కడుపులోనే ఉన్నది.
 

న్యూఢిల్లీ: మన దేశంలో పటిష్ట వ్యవస్థ కలిగిన జైళ్లలో తిహార్ జైలు(Tihar Prison) ముందు వరుసలో ఉంటుంది. కరుడుగట్టిన నేరస్తులను ఈ జైలుకు పంపుతుంటారు. ఢిల్లీలోని ఈ తిహార్ జైలు చాలా సార్లు వార్తల్లో నానింది. ఖైదీలకు యావజ్జీవం, ఉరి శిక్షల వంటి విషయాల్లో ఈ జైలు చర్చకు వచ్చేది. కానీ, ఈ సారి పూర్తిగా భిన్నమైన కారణంతో వార్తల్లోకి ఎక్కింది. తిహార్ జైలులో ఒకటో నెంబర్ గదిలో ఓ ఖైదీ(Prisoner) మొబైల్ ఫోన్(Mobile) మింగాడు. మొబైల్ ఫోన్, ఇతర అంశాలపై అనుమానంతో ఖైదీలను సోదా చేస్తుండగా భయంతో ఓ ఖైదీ సెల్ ఫోన్ మింగేశాడు. ఇది గమనించిన వెంటనే ఓ హాస్పిటల్ చేర్చారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ.. మొబైల్ ఫోన్ మాత్రం ఇంకా ఆయన కడుపులోనే ఉన్నది.

జనవరి నెల 5వ తేదీన ఈ ఘటన జరిగింది. ఓ ఖైదీ అనుమానాస్పదంగా ప్రవర్తించాడంతో జైలు అధికారులకు ఆయనపై అనుమానాలు వచ్చాయి. దీంతో ఆ ఖైదీని సోదా చేయడానికి అధికారులు చేరారు. వెంటనే భయంతో ఆ ఖైదీ మొబైల్ ఫోన్‌ను మింగేశాడని జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత ఖైదీ ద్వారానే విషయాన్ని అధికారులు తెలుసుకున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్‌కు ఆ ఖైదీని తీసుకువెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నదని, కానీ, మొబైల్ ఫోన్ మాత్రం ఇంకా ఆయన పొట్టలోనే ఉన్నదని ఆ అధికారి వెల్లడించారు. కానీ, ఆయన దగ్గరకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు.

Uttar Pradesh రాష్ట్రంలోని Fatehgarh  సెంట్రల్ జైలులో ఖైదీలు వీరంగం సృష్టించారు. జైలు సిబ్బందిపై దాడికి దిగారు. ఇద్దరు డిప్యూటీ జైలర్లను జైలులో బంధించారు.ఆదివారం నాడు ఉదయం ఈ జైలులో అల్లర్లు చెలరేగాయి. జైలులో కొంత బాగానికి prioners నిప్పంటించారు. అంతేకాదు ఖైదీలు కొందరు జైలు అధికారులపై రాళ్లతో దాడికి దిగారు. ఇద్దరు డిప్యూటీ జైలర్లు అఖిలేష్ కుమార్, శైలేష్ కుమార్లు ఖైదీల చెరలో ఉన్నారు.

అయితే ఖైదీలను చెదరగొట్టేందుకు పోలీసులు, జైలు అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా ప్రయోజనం లేదని జైలు ఉన్నతాధికారులు తెలిపారు.సందీప్ కుమార్ అనే అండర్ ట్రయల్ ఖైదీ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఖైదీలు ఆగ్రహంతో వీరంగం సృష్టించారు. సందీప్ కుమార్ కు చికిత్స అందించడానికి ఆలస్యం చేశారని ఖైదీలు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రస్తుతం జైలు ప్రాంగణంలో ఖైదీలను శాంతింపజేసే పనిలో ఉన్నారని ఫరూఖాబాద్ అదనపు ఎస్పీ అజయ్ పాల్ సింగ్ చెప్పారు.మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జైలు వద్దకు భారీగా పోలీస్ బలగాలను తరలించారు. ఖైదీల దాడిలో సుమార 30 మంది పోలీసులు గాయపడ్డారు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మేరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న సందీప్ హత్య కేసులో జైలులో ఉన్నాడు  జైలులో ఉన్న సందీప్  అనారోగ్యంతో మరణించారు. జైలులో ఉన్న సమయంలో ఆయన చికిత్స పొందుతూ చనిపోయిన విషయాన్ని తెలుసుకొన్న ఖైదీలు వీరంగం సృష్టించారు.

click me!