
ప్రధాని నరేంద్ర మోది ప్రధాన సలహాదారు పీకే సిన్హా రాజీనామా చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి మరో ఉన్నతస్థాయి అధికారి నిష్క్రమించారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సిన్హా క్యాబినెట్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన తరువాత, పిఎంఓలో ‘ప్రిన్సిపల్ అడ్వైజర్’ అనే కొత్త పోస్టును ఆయన కోసం సృష్టించిన సంగతి తెలిసిందే.
ప్రదీప్ కుమార్ సిన్హా ఉత్తర్ ప్రదేశ్ కేడర్ 1977 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. భారత 31 క్యాబినెట్ కార్యదర్శిగా ఆయన సేవలందించారు.
దీనికి ముందు సిన్హా భారత్ విద్యుత్ కార్యదర్శిగా పనిచేశారు. దానికంటే ముందు భారత షిప్పింగ్ కార్యదర్శిగా కూడా సేవలందించారు. కాగా, ఆగస్టు 30, 2019 న సిన్హాను ప్రధాని కార్యాలయంలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్‌గా నియమించారు.
11 సెప్టెంబర్ 2019న ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు.