
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి Narendra Modi సోమవారం నాడు New Parliament భవనం పై కప్పుపై National Emblem ఆవిష్కరించారు. . జాతీయ చిహ్నం మొత్తం 9500 కిలోల బరువు ఉంటుంది. దీని ఎత్తు 6.5 మీటర్లు ఉంటుంది.,ఈ జాతీయ చిహ్నాన్ని కాంస్యంతో తయారు చేశారు. ఈ చిహ్నాన్ని పార్లమెంట్ సెంట్రల్ ఫోయర్ పై భాగంలో ఏర్పాటు చేశారు. ఈ జాతీయ చిహ్నానికి 6500 కిలోల బరువున్న ఉక్కుతో సపోర్ట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ జాతీయ చిహ్నం కాన్సెప్ట్ స్కెచ్, కాస్టింగ్ ప్రక్రియ క్లే మోడలింగ్, కంప్యూటర్ గ్రాఫిక్ , పాలిషింగ్ వంటి ఎనిమిది విభిన్న దశలలో తయారు చేశారు.
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులతో కొద్దిసేపు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారుకొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులను ప్రధాని మోడీ అభినందించారు. మీరు చరిత్ర సృష్టించారని కూడా వారితో అన్నారు. ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని కార్మికులను ప్రధాని మోడీ అడిగారు. రేషన్ క్రమం తప్పకుండా మీకు అందుతుందా అని కూడా ఆయన అడిగారు. కరోనా సమయంలో కార్మికులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని కూడా ప్రధాని వారిని అడిగి తెలుసుకున్నారు. కరోనా టీకాలు వేసుకున్నారా లేదా అని కూడా ప్రధాని ఆరా తీశారు. కొత్త పార్లమెంట్ భవనం నిర్మించే పనిలో కాదు చరిత్ర సృష్టించే పనిలో కార్మికలున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.
కొత్త పార్లమెంట్ భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. భారత దేశపు సంస్కతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మిస్తున్నారు. రాజ్యాంగ హాల్, పార్లమెంట్ సభ్యుల కోసం లాంజ్, లైబ్రరీ, ఎంపీల కోసం భోజన గదులు,విస్తారమైన పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేశారు.కొత్త లోక్ సభ చాంబర్ లో 888 మంది ఎంపీలు కూర్చొనేలా సీటింగ్ ను ఏర్పాటు చేశారు. రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చొనేలా సీట్లు ఉంటాయి. లోక్ సభ, రాజ్యసభ సభ్యుల ఉమ్మడి సమావేశాల కోసం 1224 మంది సభ్యులు కూర్చొనేలా సిట్టింగ్ ను ఏర్పాటు చేయనున్నారు.
కొత్త పార్లమెంట్ భవనం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1250 కోట్లు ఖర్చు చేస్తుంది. దీనికి రూ. 977 కోట్ల బడ్జెట్ వ్యయం కంటే 29 శాతం పెరిగింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిర్మిస్తుంది. టాటా ప్రాజెక్టు సంస్థ ఈ భవనాన్ని నిర్మిస్తుంది. రాష్ట్రపతి భవన్ కు కొద్ది దూరంలోనే ఉన్న కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. 13 ఎకరాల్లో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు అంతస్థుల్లో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మోడీ సర్కార్ భావిస్తుంది. అయితే ఆగష్టు నాటికి ఈ నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేకపోవడంో ఈ ఏడాది అక్టోబర్ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది.