నేడు తమిళనాడులో మోడీ టూర్: తిరుచిరాపల్లిలో ఎయిర్‌పోర్ట్ నూతన టెర్మినల్ ప్రారంభం

By narsimha lode  |  First Published Jan 2, 2024, 10:48 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఇవాళ తమిళనాడులో పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.



న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  మంగళ , బుధవారాల్లో తమిళనాడు, లక్ష్యద్వీప్ లలో పర్యటించనున్నారు. తమిళనాడులో ఇవాళ  తిరుచిరాపల్లి విమానాశ్రయం నూతన టెర్మినల్ ను  మోడీ ప్రారంభిస్తారు.  ఈ టెర్మినల్ నిర్మాణం కోసం రూ. 1100 కోట్లు ఖర్చు చేశారు.  ప్రతి ఏటా  44 లక్షల మంది ప్రయాణీకులు  ఈ విమానాశ్రయానికి వస్తారు.


తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ యూనివర్శిటీ  38వ స్నాతకోత్సవంలో కూడ  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు.  ఏవియేషన్,  రైలు, రోడ్డు, చమురు, గ్యాస్, షిప్పింగ్ ,ఉన్నత విద్యా రంగాలకు  సంబంధించి రూ. 20 వేల కోట్లకు పైగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు.

Latest Videos

తమిళనాడుకు రైలు, రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోడీ ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలను  కలుపుతూ పలు రైలు ప్రాజెక్టులను మోడీ ప్రారంభిస్తారు.  ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాన మంత్రి మోడీ జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలోని ముఖ్యమైన కేంద్రాలు, ఓడ రేవులకు కనెక్టివిటిని మెరుగు పరుస్తాయి.  ఈస్ట్‌కోస్ట్  రోడ్డులోని  ఓడ రేవులను కలుపుతూ  ముగాయ్యూర్ నుండి మరక్కానం వరకు  నాలుగు లైన్ల రోడ్డు పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారు.


కామరాజర్ పోర్టు జనరల్ కార్గో బెర్త్ 2 నుండి మోడీ ప్రారంభిస్తారు.  దీంతో పాటు  రూ. 9 వేల కోట్లకు పైగా విలువైన పెట్రోలియం,  సహజవాయువు ప్రాజెక్టులకు కూడ ప్రధాని శంకుస్థాపన చేస్తారు.ఈ ప్రాజెక్టులలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి గుండా వెళ్లే పైప్ లైన్ కూడ ఉంది.  కల్పక్కంలో ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో రూ. 400 కోట్లతో అభివృద్ది చేసిన డెమోన్ స్ట్రేషన్ ఫాస్ట్ రియాక్టర్ ప్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంట్ ను కూడ మోడీ ప్రారంభిస్తారు.

ఈ నెల  3న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  లక్షద్వీప్ లో పర్యటిస్తారు . కవరత్తిలో టెలికాం, తాగునీరు,సౌరశక్తి,ఆరోగ్యం వంటి పథకాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు.  కద్మత్ లో టెంపరేచర్ థర్మల్  డీశాలినేషన్ ప్లాంట్ ను మోడీ జాతికి అంకితం చేస్తారు. 

click me!