రాజ్ ఘాట్ వద్ద మహాత్మగాంధీకి ప్రధాని మోదీ నివాళి

By Nagaraju penumalaFirst Published May 30, 2019, 7:31 AM IST
Highlights


ఇకపోతే ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్రమోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రి వర్గం సైతం ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఈ తరుణంలో రాజ్ ఘాట్ వద్ద మహాత్మగాంధీజికి, రాష్ట్రీయ స్మృతీ స్థల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిల స్మృతివనంల వద్ద నివాళులర్పించారు. 
 

ఢిల్లీ: భారత ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ పలువురు ప్రమఖులకు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద మహాత్మగాంధీసమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి సమాధి రాష్ట్రీయ స్మృతీ స్థల్ వద్ద వద్ద నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు ఎంపీలు మహాత్మగాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయిలకు నివాళులర్పించారు. 

ఇకపోతే ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్రమోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రి వర్గం సైతం ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఈ తరుణంలో మహాత్మగాంధీజికి, రాష్ట్రీయ స్మృతీ స్థల్ వద్ద వాజ్ పేయిలకు నివాళులర్పించారు. 

రాష్ట్రపతి భవన్ లో ఆరు బయటే మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి సైతం ఆరుబయటే ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి ప్రపంచ వ్యాప్తంగా 6వేల మంది అతిథులు హాజరుకానున్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు వర్తించనున్నాయి. 

Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat. Later today, President Ram Nath Kovind will administer the oath of office and secrecy to PM Modi. pic.twitter.com/5LbxQBuhkW

— ANI (@ANI)


 

click me!