'భాషలేన్ని ఉన్నా.. స్వరం మాత్రం ఒక్కటే' : అమెరికా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

Published : Jun 23, 2023, 03:14 AM IST
'భాషలేన్ని ఉన్నా.. స్వరం మాత్రం ఒక్కటే' : అమెరికా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

సారాంశం

అమెరికా పార్లమెంట్‌లో ప్రసంగించడం గర్వించదగ్గ విషయమని ప్రధాని మోదీ అన్నారు. ఇది అసాధారణమైన ఘట్టమనీ,భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల తరపున ఇలాంటి గౌరవం కల్పించనందుకు కృతజ్ఞతలని ప్రధాని పేర్కొన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం అమెరికా పార్లమెంట్‌లో ప్రసంగించారు. తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ప్రధాని మోదీ ఇలా అన్నారు- 'నమస్కార్! అమెరికా పార్లమెంట్‌లో ప్రసంగించడం ఎప్పుడూ గర్వించదగ్గ విషయం. ఇది అసాధారణమైన గౌరవం. భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల తరపున ఈ గౌరవానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు. కానీ భారత్ ,అమెరికా మధ్య స్నేహం చెక్కుచెదరకుండా ఉంది.' అని పేర్కొన్నారు. 
 
ప్రధాని మోదీ మాట్లాడుతూ..భారతదేశంలో మహిళలు నాయకత్వం వహిస్తున్నారనీ, ప్రపంచంలోనే అత్యధిక మహిళా పైలట్లను కలిగి ఉన్న దేశం భారత్. మార్స్ మిషన్‌కు కూడా ఆమె నాయకత్వం వహించారని తెలిపారు. ఆడపిల్లల భవిష్యత్తుపై పెట్టుబడి పెడితే మొత్తం దేశ ముఖ చిత్రాన్నే మార్చేయవచ్చనని పేర్కొన్నారు. భారతదేశం సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది, కానీ యువత అనేక అంశాలలో ముందుందని నొక్కి చెప్పారు. 
 
భారతదేశ వైవిధ్యాన్ని వివరిస్తూ.. భారత్ లో 2500 రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. రెండున్నర వేలు.  భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో 20 వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. భారత్ లో 22 అధికారిక భాషలు, వేల సంఖ్యలో మాండలికాలు ఉన్నాయి. అయినా కూడా ఒకే గొంతు( స్వరం)తో మాట్లాడతామని అన్నారు.

మేము వేగంగా ప్రగతి సాధిస్తున్నాం

నేడు ప్రపంచ దేశాలు భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలని కోరుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సభలో కూడా అదే ఉత్సుకత కనిపిస్తోందనీ,  గత దశాబ్దంలో వంద మంది US కాంగ్రెస్ సభ్యులకు ఆతిథ్యం ఇచ్చామనీ,భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం, అభివృద్ధి,వైవిధ్యం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నారని, భారతదేశం ఒకప్పుడు 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, నేడు భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని తెలిపారు. భారత్ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని అన్నారు. భారత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.  

కమలా హారిస్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు 

సమానత్వంపైనే అమెరికా పునాది ఉందని ప్రధాని మోదీ అన్నారు. అమెరికా కలలో సమాన భాగస్వాములుగా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలకు ప్రాధాన్యత  ఉంటుందనీ, అమెరికాలో లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్నారని పేర్కోన్నారు. అంతేకాకుండా.. కొందరైతే ఇక్కడ పార్లమెంటులో సగర్వంగా కూర్చున్నారనీ, వారిలో ఒకరు చరిత్ర సృష్టించిన నా (కమలా హారిస్) వెనుక కూడా ఉన్నారని కమలా హారిస్ ను ప్రశంసించారు. సమోసా కాకస్ రుచి ఇప్పుడు పార్లమెంటులో కనిపిస్తోందని  చెప్పారు. త్వరలో వివిధ రకాల భారతీయ వంటకాలను చూడాలని ఆశిస్తున్నానని అన్నారు. 

చరిత్రను పరిశీలిస్తే, ప్రజాస్వామ్యం సమానత్వాన్ని తీసుకువచ్చే స్ఫూర్తి అని ఒకటి స్పష్టమవుతుంది. ప్రజాస్వామ్యమే చర్చను ప్రోత్సహిస్తుంది. ప్రజాస్వామ్యమే ఆలోచనలకు, భావ వ్యక్తీకరణకు అవకాశం ఇస్తుంది. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, భారత్-అమెరికా కలిసి ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించగలవని అన్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో గత కొన్నేళ్లుగా చాలా మార్పులు వచ్చాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీనితో పాటు మరొక AI(అమెరికా-ఇండియా) విషయంలోనూ భారీ మార్పులు వచ్చాయన్నారు.  

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు