సినిమా ఫక్కీలో ట్రైన్ ఛేజింగ్.. దొంగల ముఠా ఆటకట్టించిన తమిళ పోలీసులు...

Published : Mar 07, 2022, 02:00 PM ISTUpdated : Mar 07, 2022, 02:01 PM IST
సినిమా ఫక్కీలో ట్రైన్ ఛేజింగ్.. దొంగల ముఠా ఆటకట్టించిన తమిళ పోలీసులు...

సారాంశం

తమిళనాడు పోలీసులు సాహసం చేశారు. ఏకంగా ట్రైన్ లో ఛేజింగ్ చేసి మరీ ఓ దొంగలముఠా గుట్టు రట్టు చేశారు. దీనికోసం వారు రైల్వే పోలీసుల సహాయం తీసుకున్నారు. 

చెన్నై : ఇప్పటివరకు దొంగల వేటలో బైక్,  కారు chasingలు చేసిన  tamilnadu  పోలీసులు తాజాగా.. ట్రైన్ చేజింగ్ తో ఉత్తరాది ముఠా ఆట కట్టించారు. తిరుపూర్ కు చెందిన యూనియన్  మిల్ రోడ్డు  కేపీఎస్ కాలనీకి చెందిన జయకుమార్ అదే ప్రాంతంలో కుదవ దుకాణం నడుపుతున్నాడు  ఈనెల మూడో తేదీ అర్ధరాత్రి ఆ దుకాణంలో దోపిడీ జరిగింది.  నాలుగో తేదీ  ఉదయాన్నే ఈ ఘటన వెలుగు చూసింది.

ఈ దోపిడీలో 3 కేజీల బంగారం, 9 కేజీల వంెడి, రూ.25 లక్షల నగదును అపహరించుకు వెళ్లారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా దొంగల కోసం వేట మొదలుపెట్టారు. నలుగురు యువకులు ఈ దోపిడీకి పాల్పడినట్టు తేలింది. తిరుప్పూర్ నుంచి ఈ యువకులు చెన్నైకి చేరుకున్నట్లు గుర్తించారు. చివరికి చెన్నై నుంచి ముంబై వైపుగా వెళ్లే రైలు ఎక్కినట్లు తేలింది. 

సీసీ ఫుటేజీ ఆధారంగా…
సీసీ కెమెరాలు లోని దృశ్యాల ఆధారంగా మరో రైలులో  తమిళ పోలీసులు ఛేజింగ్‌ చేసినందుకు బయల్దేరారు. రైల్వే పోలీసుల సహాయంతో ఆదివారం ఉదయాన్నే ఆ నలుగురు యువకులను చాకచక్యంగా నాగపూర్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు.  విచారణలో దోపిడీకి పాల్పడింది తామేనని వారు అంగీకరించారు.

వారి వద్ద నుంచి 3 కేజీల బంగారం, తొమ్మిది కేజీల వెండి, రూ. 14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.  24 గంటల్లో 11లక్షలు మాయం చేసి ఉండడంతో,  వీరికి సహకరించిన వారు ఎవరైనా తిరుప్పూర్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించుకున్నారు. బీహార్కు చెందిన ఈ నలుగురిని సోమవారం నాగపూర్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత తిరుప్పూర్‌కు తరలించనున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్