విలాసవంతమైన గంగా విలాస్ క్రూయిజ్, టెంట్ సిటీని ప్రారంభించిన ప్రధాని మోడీ.. వీటి విశేషాలేమిటంటే ?

By team teluguFirst Published Jan 13, 2023, 2:37 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరంమైన వారణాసిలో గంగానదిపై విలాసవంతమైన గంగా విలాస్ క్రూయిజ్ ను అలాగే టెంట్ సిటీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇవి భారతదేశ కొత్త పర్యాటక యుగానికి నాంది పలుకుతాయని అన్నారు. 

భారత ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విలాసవంతమైన గంగా విలాస్ రివర్ క్రూయిజ్, టెంట్ సిటీని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి అస్సాంలోని దిబ్రూఘడ్ వరకు దాదాపు 3,200 కిలోమీటర్ల ప్రయాణాన్ని సాగించే ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ ఎంవీ గంగా విలాస్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ‘‘గంగా నదిపై ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీస్ ప్రారంభం కావడం ఒక మైలురాయి. ఇది భారతదేశంలో కొత్త పర్యాటక యుగానికి నాంది పలుకుతుంది” అని అన్నారు. ఈ పెద్ద ప్రాజెక్టులే కాకుండా వారణాసి, సమీప ప్రాంతాల స్థానిక సంస్కృతిని పర్యాటకులు ఆస్వాదించేందుకు ఐదు కొత్త జెట్టీలను కూడా ఆయన ప్రారంభించారు. 

WATCH LIVE

PM to flag off MV Ganga Vilas Cruise, the world's longest river cruise

📹: https://t.co/1Zj6BusuAu pic.twitter.com/7C1IQZ8ZVI

— MyGovIndia (@mygovindia)

‘‘ నేడు రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. ఇది తూర్పు భారతదేశంలో వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలను విస్తరిస్తుంది’’ అని ప్రధాని అన్నారు. ‘‘ నేను రివర్ క్రూయిజ్ లైనర్ ఎంవీ గంగా విలాస్‌లో ప్రయాణీకులకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. భారతదేశంలో మీరు ఊహించగలిగే ప్రతిదీ ఉంది. మీ ఊహకు మించినది కూడా ఉంది. భారతదేశాన్ని పదాలలో నిర్వచించలేము, కానీ హృదయంతో అనుభవించవచ్చు. భారతదేశం ఎప్పుడూ మతాలకు అతీతంగా అందరికీ తన హృదయాన్ని తెరిచి ఉంచుతుంది’’అని ప్రధాని మోడీ తెలిపారు. 

దేశ ఉజ్వల వారసత్వాన్ని, ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని పెంపొందించే ‘గంగా విలాస్’ పర్యాటకులకు మన సుసంపన్నమైన చారిత్రక, సాంస్కృతిక, మత సంప్రదాయాలతో పాటు ‘న్యూ ఇండియా’ గురించిన అవలోకనాన్ని ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. నదీ జల మార్గాలను జరుపుకునే గొప్ప పండుగను చూడడం మనందరికీ సంతోషకరమైన విషయమని తెలిపారు. గంగాజీ మనకు కేవలం నీటి ప్రవాహం మాత్రమే కాదు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్భానంద సోనోవాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఈ కార్యక్రమంలో చేరారు. “ రివర్ క్రూయిజ్ కాశీని అస్సాంను కూడా కలుపుతుంది. ఈ క్రూయిజ్‌లో వచ్చే ప్రయాణికులు మా కామాఖ్య దేవాలయం, కజిరంగా నేషనల్ పార్క్, ఇతర ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని పొందుతారు. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ” అని అస్సాం సీఎం శర్మ తెలిపారు.

టెంట్ సిటీ వారణాసిలోని గంగానదికి అడ్డంగా ఇసుకపై నిర్మించారు. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈరోజు నుంచి ఇది పర్యాటకులకు అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ పర్యాటకులు బస చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన టెంట్ సిటీ కానుంది. ఇందులో 4 కేటగిరీల విలాసవంతమైన కాటేజీలు ఉన్నాయి. దీని ధర రూ.8,000 నుంచి 51,000గా ఉంటుంది. మతం, ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దీనిని రూపొందించారు. ఈ టెంట్ సిటీ 100 హెక్టార్లలో నిర్మించారు. పర్యాటకులు ఇక్కడ బస చేసి, గంగా హారతిని కూడా వీక్షించవచ్చు. టెంట్ సిటీ, గంగా విలాస్ లో మాంసం, మద్యానికి గ్రీన్ సిగ్నల్ పూర్తిగా నిషేధం. ఇక్కడ పరిశుభ్రత, భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఈ క్రూయిజ్ 25 విభిన్న నదుల గుండా వెళుతుంది. భారతదేశంలోని పలు ప్రదేశాలను కలుపుతుంది. 

click me!