ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ అరెస్టు అక్రమం: కేరళ హైకోర్టులో సీబీఐ

By Mahesh KFirst Published Jan 13, 2023, 2:36 PM IST
Highlights

ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ పై నకిలీ కేసు బనాయించారని, ఆయన అరెస్టు అక్రమమైందని సీబీఐ కేరళ హైకోర్టులో వాదించింది. నంబి నారాయణన్ పై దర్యాప్తు చేసిన అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. తాజాగా, ఆ కేసులోని నిందిత అధికారులు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్ పై విచారణలో సీబీఐ కీలక వాదనలు వినిపించింది.
 

తిరువనంతపురం: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సైంటిస్ట్ నంబి నారాయణన్ పై 1994లో నమోదైన గూఢచర్యం కేసు అక్రమమైనదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తెలిపింది. ఆయనపై నమోదైన కేసు నకిలీదని, అతని అరెస్టు అక్రమం అని కేరళ హైకోర్టుకు తెలియజేసింది. 

నంబి నారాయణన్ పై నకిలీ గూఢచర్యం కేసు నమోదు కావడం చాలా సీరియస్ విషయం అని సీబీఐ అభిప్రాయపడింది. ఈ కేసు దేశ భద్రతకు సంబంధించిన అంశమని, ఆయన పై నకిలీ కేసు నమోదు కావడం వెనుక విదేశీ శక్తుల కుటర్ ఉన్నదని సీబీఐ పేర్కొంది. ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రజ్ఞుడైన నంబి నారాయణ్ పై నకిలీ కేసు పెట్టడం వెనుక విదేశీ శక్తుల హస్తం ఉన్నదని ఆరోపణలు చేసింది.

నంబి నారాయణన్ తరఫు న్యాయవాది కూడా కోర్టులో వాదించారు. భారత అంతరిక్ష పరిశోధనలకు క్రయోజనిక్ ఇంజిన్ అభివృద్ధి చేయడం చాలా కీలకంగా ఉండిందని, ఆ ప్రాజెక్టును నిలిపేయడానికే నంబి నారాయణన్ పై నకిలీ కేసు బనాయించారని కోర్టులో చెప్పారు.

Also Read: గగన్‌యాన్ మిషన్ ఆలస్యం.. 2024 నాల్గో త్రైమాసికంలో ప్ర‌యోగించ‌నున్న‌ట్టు కేంద్రం వెల్ల‌డి

నంబి నారాయణన్ పై దర్యాప్తు చేసిన అధికారులపై సీబీఐ ఓ కేసు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో కేరళ హైకోర్టు వాదనలు వింటున్నప్పుడు నంబి నారాయణన్ అడ్వకేట్ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, సీబీఐ కేసులో నిందితులుగా ఉన్న అధికారులు బెయిల్ కోసం కేరళ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ బెయిల్ అప్లికేషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్న తరుణంలో సీబీఐ పై ఆరోపణలు సంధించింది.

click me!