రాముడిపై నమ్మకంతో 1990లో ప్రారంభించిన రథయాత్ర ఒక ఉద్యమంలా మారుతుందని అప్పుడు మేము ఊహించలేదు. రథయాత్ర సమయంలో మోడీ నా వెంటే ఉన్నారు. నేను కేవలం రథసారధిని మాత్రమే అనుకున్నాను.
ఢిల్లీ : ప్రధాని మోదీని ఆ రాముడే తన భక్తుడిగా ఎంచుకున్నాడని ఆలయాన్ని నిర్మింపచేసే పనిని పూర్తి చేయించుకున్నాడని బిజెపి సీనియర్ నేత ఎల్ కే అద్వానీ అన్నారు. తాను కేవలం రాముడికి రథసారధిని మాత్రమే అన్నారు. ఈ మేరకు బిజెపి సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మాట్లాడుతూ.. ‘ఆలయ నిర్మాణ కర్తగా ప్రధాని నరేంద్ర మోడీనే రాముడు ఎంచుకున్నాడు. నేను కేవలం రథసారధిని మాత్రమే. రామ మందిరం కోసం రథయాత్ర చేస్తున్న సమయంలో మందిర నిర్మాణం ఏదో ఒక రోజు జరుగుతుందని అనుకున్నాను. ఇప్పుడా భావన వాస్తవరూపం దాల్చింది.
అయోధ్యలో ఆలయం నిర్మించడం విధి నిర్ణయం. నరేంద్ర మోడీ భారత్ లోని ప్రతి పౌరుడికి ప్రాతినిథ్యం వహిస్తానన్నారు.. అందుకే శ్రీరాముడే మోదీని ఎంచుకున్నారు. నా రాజకీయ జీవితంలో అయోధ్య ఉద్యమం అత్యంత నిర్ణయాత్మకమైన ఘటన. రాముడిపై నమ్మకంతో 1990లో ప్రారంభించిన రథయాత్ర ఒక ఉద్యమంలా మారుతుందని అప్పుడు మేము ఊహించలేదు. రథయాత్ర సమయంలో మోడీ నా వెంటే ఉన్నారు. నేను కేవలం రథసారధిని మాత్రమే అనుకున్నాను.
undefined
PM Modi | అజ్మీర్ దర్గాకు కానుకగా చాదర్‌ను పంపిన ప్రధాని మోదీ
అప్పుడు మా వెన్నంటి ఉన్న మాజీ ప్రధాని వాజ్ పేయి, ఇప్పుడు లేకపోవడం కాస్త విచారం కలిగిస్తుంది. ఈ యాత్ర నా జీవితాన్ని ప్రభావితం చేసిన అనేక సంఘటనలు జరిగాయి. యాత్ర మొత్తం ఎంతో భావోద్వేగాపూరితంగా జరిగింది. రథయాత్ర జరుగుతున్న సమయంలో గ్రామాలకు వెళ్లినప్పుడు మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రజలు నా దగ్గరికి వచ్చి సెల్యూట్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యేవారు. రామ మందిరం నిర్మాణం జరగాలన్న వారందరి కలలు ఇప్పుడు సహకారం అవుతున్నాయి’ అన్నారు.
ఈనెల 22న అయోధ్యలో జరగనున్న రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. ఈనెల 14వ తేదీ నుంచి 24 వరకు అయోధ్యలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్య అతిథుల్లో అద్వానీ ఉన్నారు.