తన తాత నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్నారని, గురువారం ఉదయం ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని వైద్యులు తెలిపారని బల్వాన్ తెలిపారు. వెంటిలేటర్ దీసేసి, మృతి చెందినట్లు ప్రకటించారు. అంబులెన్స్ హర్యానాలోని కైతాల్‌లోని ధండ్ గ్రామ సమీపంలో ఉన్నప్పుడు, అది ఒక గుంతకు బలంగా ఢీకొట్టింది.
చండీగఢ్ : భారత్ లో రోడ్డు మీద గుంతల విషయంలో ఎన్నో వార్తలు వస్తుంటాయి. ఆ గుంతల్లో ప్రయాణిస్తే ఎప్పుడో పోవాల్సిన ప్రాణం ఇప్పుడే పోతుందని, గర్భిణీలకు సులభంగా ప్రసవం అయిపోతుందని ఎన్నో జోక్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే, అలాంటి ఓ గుంతే చనిపోయాడనుకున్న వ్యక్తిని సజీవంగా మార్చింది. ఈ ఘటన చండీగడ్ లో వెలుగు చూసింది.
గురువారం హర్యానాకు చెందిన 80 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు, దర్శన్ సింగ్ బ్రార్ అనే ఆ వ్యక్తిని పాటియాలా నుండి కర్నాల్ సమీపంలోని అతని ఇంటికి అంబులెన్స్ లో తీసుకువెళుతున్నారు. బంధువులందరూ అంతిమయాత్రకు వచ్చారు. అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్నారు. ఇంతలో అంబులెన్స్ ఒక గుంతలో పడింది. అంబులెన్స్‌లో అతనితో పాటు ఉన్న అతని మనవడు ఉన్నాడు. గుంతలో పడిన తరువాత అతను చేతిని కదపడం మనవడు గమనించాడు. వెంటనే పరీక్షించగా గుండె కొట్టుకుంటోంది. దీంతో వెంటనే అంబులెన్స్ డ్రైవర్‌ను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు. అక్కడి వైద్యులు అతడు బతికే ఉన్నట్లు ప్రకటించారు.
undefined
PM Modi | అజ్మీర్ దర్గాకు కానుకగా చాదర్‌ను పంపిన ప్రధాని మోదీ
80 ఏళ్ల ఆ హృద్రోగి ఇప్పుడు కర్నాల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు ఈ సంఘటనను ఒక అద్భుతం అని, అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. బ్రార్ మనవళ్లలోలో ఒకరైన బల్వాన్ సింగ్ మాట్లాడుతూ, 80 తమ తాత పేరు వారుండే కర్నాల్ ప్రాంతంలో అందరికీ తెలుసని గత కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేదని తెలిపారు. దీంతో చికిత్స కోసం పాటియాలాలోని అతని ఇంటికి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపాడు.
తన తాత నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్నారని, గురువారం ఉదయం ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని వైద్యులు తెలిపారని బల్వాన్ తెలిపారు. వెంటిలేటర్ దీసేసి, మృతి చెందినట్లు ప్రకటించారు. అంబులెన్స్ హర్యానాలోని కైతాల్‌లోని ధండ్ గ్రామ సమీపంలో ఉన్నప్పుడు, అది ఒక గుంతకు బలంగా ఢీకొట్టింది. దీంతో వృద్ధుడిలో చలనం వచ్చింది.
రావల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నేత్రపాల్ మాట్లాడుతూ, "రోగి చనిపోయాడని చెప్పలేం. అతన్ని మా వద్దకు తీసుకువచ్చినప్పుడు, శ్వాస పీల్చుకుంటున్నాడు.రక్తపోటుతో పాటు పల్స్ కూడా ఉంది. వేరే ఆసుపత్రిలో ఏమి జరిగిందో మాకు తెలియదు. ఇది సాంకేతిక లోపం లేదా మరేదైనా కావచ్చు" అన్నారు.