భూ వివాదంలో పూజారి సజీవదహనం: అంత్యక్రియలకు కుటుంబం నిరాకరణ, కారణమిదే

By Siva KodatiFirst Published Oct 10, 2020, 5:07 PM IST
Highlights

స్థల వివాదం నేపథ్యంలో దుండగుల చేతిలో సజీవ దహనానికి గురైన పూజారి వ్యవహారం రాజస్థాన్‌లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు నెరవేర్చే వరకు అంతిమ సంస్కారాలు నిర్వహించేది లేదని మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు

స్థల వివాదం నేపథ్యంలో దుండగుల చేతిలో సజీవ దహనానికి గురైన పూజారి వ్యవహారం రాజస్థాన్‌లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు నెరవేర్చే వరకు అంతిమ సంస్కారాలు నిర్వహించేది లేదని మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.

తమ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, నిందితులందరిని అరెస్ట్ చేయడంతో పాటు వారికి సహకరిస్తున్న పట్వారీ, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా తమ కుటుంబానికి సాయుధులైన పోలీసుల చేత రక్షణ కల్పించాలని పూజారి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) ఓం ప్రకాశ్ మీనా పూజారి కుటుంబానికి నచ్చజెప్పి అంత్యక్రియలు నిర్వహించేందుకు గాను సదరు గ్రామానికి చేరుకున్నారు. మృతుడు మరణించి దాదాపు రెండు రోజులు గడుస్తున్నందున అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా మీనా.. కుటుంబసభ్యులకు విజ్ఞప్తి చేశారు. 

రాజస్థాన్‌‌‌‌‌‌‌‌ గ్రామాల్లోని ఆలయ భూములకు పూజారు లే సంరక్షకులుగా ఉంటారు. వాటి ఆదాయంతో గుడు ల్లో పూజలు, ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారి జీవనాధారం కూడా ఈ భూములే. కరౌలి జిల్లాలోని బుక్నా గ్రామంలో రాధాకృష్ణ టెంపుల్ ట్రస్ట్ కు చెందిన 5.2 ఎకరాల భూమి పూజారి బాబూ లాల్ వైష్ణవ్ అధీనంలో ఉంది.

ఈ భూమికి దగ్గరగా ఉన్న స్థలంలో తన కోసం ఒక ఇల్లు కట్టుకోవాలని పూజారి అనుకున్నారు. భూమి చదును చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇక్కడ డామినేషన్ ఎక్కువుండే మీనా కమ్యూనిటీ వాళ్లు అడ్డుకున్నరు.

ఆ భూమి తమదని వాదించారు. దీంతో గొడవ గ్రామ పంచాయతీకి చేరింది. పెద్దలు పూజారికి అనుకూలంగా తీర్పు చెప్పారు. ఈ నేపథ్యంలో భూమి తనదని చెప్పేందుకు సంకేతంగా తాను కొత్తగా పండించిన కొన్ని జొన్న బేళ్లను పూజారి అక్కడ ఉంచారు.

కానీ పూజారి చదును చేయించిన భూమిలో నిందితులు తమ గుడిసెను నిర్మించడం ప్రారంభించారు. దీంతో ఇది గొడవకు దారితీసింది. ‘‘నేను చదును చేసిన భూమిలో పెట్టిన జొన్న బేళ్లను అరుగురు వ్యక్తులు బుధవారం పెట్రోల్ పోసి అంటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాబులాల్ కన్నుమూశారు.

 

click me!