వైరల్ : పంచాయితీ మీటింగ్ లో.. కింద కూర్చున దళిత మహిళా ప్రెసిడెంట్...

By AN TeluguFirst Published Oct 10, 2020, 4:18 PM IST
Highlights

తన అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్ లో తనే కింద కూర్చున్న ఓ దళిత పంచాయితీ నాయకురాలి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనలో జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి, దర్యాప్తుకు ఆదేశించారు. వివరాల్లోకి వెడితే.. 

తమిళనాడు కడలూరులోని థర్కు తిట్టే గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ గా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడింది. ఆది ద్రవిడ షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి  ఆమె. ఈ సీటు షెడ్యూల్డు కులాలకు రిజర్వ్ చేయబడింది. 

జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ సఖామూరి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తొందర్లోనే దీనిమీద స్పష్టత వస్తుందని తెలిపారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో షెడ్యూల్డ్ కులాలు నివసించే ప్రాంతాలు వేరుగా ఉంటాయి. "ఉన్నత కులాలు" నివసించే ప్రాంతాల నుండి వెడుతున్నప్పుడు చెప్పులు చేతిలో పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. గతంలో చాలాసార్లు చెప్పులు చేతుల్లో పట్టుకుని వెడుతున్న దృశ్యాలు కెమెరాలో చిక్కాయి.

ఒక దశాబ్దం క్రితం వరకు మదురై జిల్లాలోని పప్పపట్టి, కీరిపట్టి మరియు నత్తర్మంగళం అనే మూడు రిజర్వు గ్రామ పంచాయతీల్లో  ఆధిపత్య కులాల వారికి భయపడి షెడ్యూల్డ్ కుల అభ్యర్థులు పోటీ చేయలేదు. పోటీ చేసి గెలవటానికి ధైర్యం చేసిన వారు రాజీనామా చేయవలసి వచ్చింది.

అణగారిన వర్గాలకు చెందిన స్త్రీ, పురుషులను రాజకీయంగా శక్తివంతం చేయడానికి ఏర్పాటైన ఎన్నికల రిజర్వేషన్ వ్యవస్థ ఇలా అపహాస్యం పాలవుతుంది. 
 
click me!