ఈ కొబ్బరి కాయ ధర రూ.66వేలు.. అంత విలువ ఎందుకంటే...

Published : Nov 03, 2022, 09:53 AM ISTUpdated : Nov 03, 2022, 09:55 AM IST
ఈ కొబ్బరి కాయ ధర రూ.66వేలు.. అంత విలువ ఎందుకంటే...

సారాంశం

ఓ కొబ్బరికాయ వేలంలో రూ.66వేల ధర పలికింది. దీంతో ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

తమిళనాడు : తమిళనాడులోని తేని జిల్లా బోడి ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయంలో స్కందషష్టి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వళ్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. పూజల్లో ఉంచిన వస్తువులను మంగళవారం వేలం వేశారు. కొబ్బరికాయను రూ.66వేలకు ఓ భక్తుడు సొంతం చేసుకున్నారు. గతేడాది రూ.27 వేలు పలికింది. ఇంట్లో ఈ కొబ్బరికాయను ఉంచి పూజలు నిర్వహిస్తే ఐశ్వర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం. 
 

PREV
click me!

Recommended Stories

Gig Workers: డిసెంబ‌ర్ 31న జొమాటో, స్విగ్గీ సేవ‌ల్ బంద్‌.. కార‌ణం ఏంటంటే.?
Womens Welfare Schemes : ఇక్కడి మహిళలకు సూపర్ స్కీమ్స్.. దేశంలోనే నెంబర్ 1