Presidential Fleet Review: ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూకు సిద్ధ‌మైన విశాఖ సాగ‌ర తీరం .. దాని ప్రాముఖ్యతేమిటి?

Published : Feb 21, 2022, 09:29 AM IST
Presidential Fleet Review:  ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూకు సిద్ధ‌మైన విశాఖ సాగ‌ర తీరం .. దాని ప్రాముఖ్యతేమిటి?

సారాంశం

Presidential Fleet Review: ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం సిద్ద‌మైంది. నౌకా దళ యుద్ధ విన్యాసాలకు విశాఖ సాగర తీరం స‌మ‌య‌త్నమ‌య్యింది. అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే ప్రధాన ఘట్టం నేడు ప్రారంభం కానున్న‌ది. ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, వివిధ దేశాల నౌకా దళాల యుద్ధ విన్యాసాలతో మిలాన్‌ – 2022 కు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దాదాపు  ఏడాది కాలంగా నౌక ద‌ళం ఏర్పాటు చేస్తుంది. ఈ మేర‌కు భారీ స్థాయిలో ఏర్పాటు జ‌రిగాయి.   

Presidential Fleet Review:  ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం సిద్ద‌మైంది. నౌకా దళ యుద్ధ విన్యాసాలకు విశాఖ సాగర తీరం స‌మ‌య‌త్నమ‌య్యింది. అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే ప్రధాన ఘట్టం నేడు ప్రారంభం కానున్న‌ది. ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, వివిధ దేశాల నౌకా దళాల యుద్ధ విన్యాసాలతో మిలాన్‌ – 2022 కు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దాదాపు  ఏడాది కాలంగా నౌక ద‌ళం ఏర్పాటు చేస్తుంది. ఈ మేర‌కు భారీ స్థాయిలో ఏర్పాటు జ‌రిగాయి. 

రాష్ట్రపతి ఫ్లీట్‌ రివ్యూ 

అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే ప్రధాన ఘట్టం . దేశ నౌక ద‌ళ  నౌకదళ బలాన్ని సమీక్షించ‌డానికి రాష్ట్రపతి ఫ్లీట్‌ రివ్యూ నిర్వ‌హిస్తారు. త్వ‌దారా మ‌న దేశ శ‌క్తి సామ‌ర్థ్యాలు ఇత‌ర దేశాల‌కు తెలుస్తాయి. రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారైన సర్వ సైన్యాధ్యక్ష హోదాలో ఫ్లీట్ రివ్యూ చేయ‌డం ఆనవాయితీగా వ‌స్తుంది. ఈ సారి సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ పాల్గొన్నారు.

రాష్ట్రపతి ఫ్లీట్‌ రివ్యూ పేరిట చేసే..  నౌకాదళ విన్యాసాల్లో మొత్తం 44 యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు , జలాంతర్గాములు, అత్యాధునిక నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు భాగం పంచుకుంటున్నాయి. రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన యుద్ధనౌక నుంచి నాలుగు వరసల్లో మోహరించిన 44 నౌకలని పరిశీలిస్తారు.  వీటిని పరిశీలిస్తూ ప్రత్యేకంగా అలంకరించిన భారత గస్తీ నౌక 'INS సుమిత్ర'లో రాష్ట్రపతి వాటి మధ్యగా వెళుతూ, ఆ నౌకల సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. సుమారు 2గంటల పాటు సాగే ఈ సమీక్ష కనులపండువగా సాగనున్న‌ది. ఇది విశాఖపట్నంలో నిర్వహిస్తున్న మూడో ఫ్లీట్‌ రివ్యూ. చివరగా 2016లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది.
 

ఫ్లీట్ సమీక్షలో ఇంకా ఏమి జరుగుతుంది?

అత్యంత లాంఛనప్రాయమైన నావికాదళ వేడుకల్లో.. రాష్ట్రపతి ప్రయాణిస్తున్నప్పుడు ఇత‌ర‌ నౌకల్లో ఉండే సిబ్బంది గౌరవ వందనం సమర్పిస్తారు. అనేక హెలికాప్టర్లు, ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ద్వారా అద్భుతమైన ఫ్లై-పాస్ట్ ప్రదర్శనలో భారత నావికాదళ వైమానిక దళాన్ని కూడా రాష్ట్రపతి సమీక్షించనున్నారు. సమీక్ష చివరి దశలో.. యుద్ధనౌకలు, జలాంతర్గాముల విన్యాసాల‌ను రాష్ట్ర‌ప‌తి స‌మీక్షించ‌నున్నారు. మొత్తం 10 వేల మందికి పైగా నావికులు, సిబ్బంది ఈ రివ్యూలో పాల్గొంటున్నారు.
చేతక్‌, ఏఎల్‌హెచ్‌., సీకింగ్‌, కమోవ్‌ హెలికాప్టర్లు, డోర్నియర్‌, ఐ.ఎల్‌.-38ఎస్‌.డి., పి8ఐ, హాక్‌, మిగ్‌ 29కే యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో సముద్ర మధ్యన విన్యాసాలు చేస్తాయి.


ఎన్ని సార్లు సమీక్షలు జరిగాయి?

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 11 ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూలు జరిగాయి. మొదటిది 1953లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. తదుపరి 1964లో అప్పటి రక్షణ మంత్రి వై బి చవాన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. అప్పటి నుండి.. రాష్ట్రపతి నౌకాదళాన్ని సమీక్షిస్తున్నారు. 12 సంవ‌త్స‌రాల త‌రువాత 1989 లో ప్రెసిడెంట్ ఆర్ వెంకట్రామన్, 2001 లో ప్రెసిడెంట్ కె ఆర్ నారాయణన్, 2016లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హయాంలో ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూలు జరిగాయి. 2001, 2016లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు జ‌రిగాయి. ఇందులో భారత నౌకాదళం తో పాటు  ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, ఇండోనేషియా, దక్షిణ కొరియా మరియు UKతో సహా ఇతర దేశాలలో నౌకలు కూడా పాల్గొన్నాయి. 
 

ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ ప్రాముఖ్యత ఏమిటి?

ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ అనేది.. నేవీకి ఇది చాలా ముఖ్యమైన సంఘటనలలో ఒకటి. అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే ప్రధాన ఘట్టం. నేడు  ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో స్టార్ట్ అయ్యి 25 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌