రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తు.. రేపు ఢిల్లీకి శరద్ పవార్..

Published : Jun 11, 2022, 01:19 PM IST
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తు.. రేపు ఢిల్లీకి శరద్ పవార్..

సారాంశం

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలనైన నేపథ్యంలో.. ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేపట్టింది. ఇందుకోసం పలు పార్టీలతో చర్చించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలనైన నేపథ్యంలో.. ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేపట్టింది. ఇందుకోసం పలు పార్టీలతో చర్చించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె పలు ప్రతిపక్ష పార్టీలకు ఫోన్ చేసి మాట్లాడిన సోనియా గాంధీ.. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చర్చించారు. సోనియాగాంధీ కొవిడ్‌తో బాధ పడుతున్న కారణంగా ప్రతిపక్ష పార్టీలతో మంతనాలు జరిపే బాధ్యతను రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లిఖార్జున్‌ఖర్గేకు అప్పగించారు. కాంగ్రెస్‌తో కలిసి వచ్చే పార్టీలతో చర్చించాల్సిందిగా సూచించారు.

ఈ క్రమంలోనే మల్లికార్జున్ ఖర్గే ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. భావసారూప్యత గల పార్టీలతో కూడా ఆయన సమావేశమై చర్చలు జరిపారు. పలు పార్టీలతో కలిసి సమావేశం నిర్వహించి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తొలుత కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటిస్తే.. ఇతర పార్టీలు కలిసొచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కలిసివచ్చే పార్టీలతో చర్చలు జరిపి.. అందరి ఆమోదంతోనే ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తుంది. 

ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఢిల్లీలో సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని శరద్ పవార్ ధ్రువీకరించారు. శరద్ పవార్ పుణెలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో రాష్ట్రపతి ఎన్నికలపై ఎలాంటి చర్చలు జరగలేదు. రేపు నేను ఢిల్లీకి వెళుతున్నాను. దాని గురించి చర్చిస్తాను. ఈ అంశంపై మేమందరం కూర్చుని చర్చిద్దామని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు. 

శరద్ పవార్, సోనియా గాంధీ భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి పేరుపై రేపు ఇరువురు నేతల భేటీలో చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సారి కూడా  ఎన్డీయే అభ్య‌ర్థినే రాష్ట్ర‌ప‌తి పీఠంపై కూర్చోబెట్టాల‌ని బీజేపీ వ్యూహ ర‌చ‌న చేస్తుంది. ఎన్డీయే అభ్యర్థి భారత తదుపరి రాష్ట్రపతిగా ఎన్నిక అవడం దాదాపు ఖాయం. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే ఆధిపత్యం నెగ్గ‌డానికి, ఆ మేజిక్ మార్కుకు 1.2 శాతం ఓట్ల దూరంలో వుంది. ఎన్డీయే మిత్రకూట‌మి అయినా.. అన్నాడిఎంకే, తటస్థ పార్టీలైన ఏపీలోని వైసీపీ, బీజూ జనతాదళ్మద్దతు ఇస్తాయని బీజేపీ ధీమాతో ఉంది. 


ఇక, జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను అదే నెల 21న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో 4,809 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో రాజ్యసభ ఎంపీలు 233 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది, ఎమ్మెల్యేలు 4,033 మంది ఉన్నారు.అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో విప్‌ జారీ చేసేందుకు ఏ రాజకీయ పార్టీకి అధికారం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం