
Presidential election 2022: భారత 15వ రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో నిలిచారు. ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ తొలుత ఓటు వేశారు. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.
అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రతిచోటా శాంతియుతంగా, స్నేహపూర్వకంగా, చాలా ప్రశాంతంగా ముగిశారని చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ పిసి మోడీ తెలిపారు. ఈ ఎన్నికల్లో 736 మంది ఓటర్లలో (727 మంది పార్లమెంటు సభ్యులు, 9 మంది శాసనసభ సభ్యులు) 730 మంది ఓటర్లు (721 మంది ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలు) ఓటు వేశారు. పార్లమెంటు హౌస్‌లో మొత్తం 99.18% ఓటింగ్ జరిగినట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాలతో సహా అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకోబడతారు. ఎన్నికైన 4800 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి అర్హులు.