రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంపై కాంగ్రెస్ నేత అసంతృప్తి.. ‘ఈ వివరాలు ఆయన ప్రస్తావించనే లేదు’

Published : Jan 31, 2022, 03:43 PM IST
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంపై కాంగ్రెస్ నేత అసంతృప్తి.. ‘ఈ వివరాలు ఆయన ప్రస్తావించనే లేదు’

సారాంశం

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన చాలా కీలకమైన ఎన్నో విషయాలను తన ప్రసంగంలో ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు. నాగాలాండ్‌లో పౌరులను చంపేయడం, జమ్ము కశ్మీర్‌కు రాష్ట్రహోదా, సెకండ్ వేవ్ సమయంలో మరణాల గురించి మాట్లాడలేదని వివరించారు. ఈ రోజు ఉదయం రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంటులో ప్రసంగించిన సంగతి తెలిసిందే.  

న్యూఢిల్లీ: ఈ రోజు పార్లమెంటు(Praliament)లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(President Ramnath Kovind0 ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఏకరువు పెట్టారు. దేశంలోని కీలక ఘట్టాలను ఆయన ప్రస్తావించారు. అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంపై కాంగ్రెస్(Congress) సీనియర్ నేత మనీష్ తివారీ(Manish Tewari0 స్పందించారు. రాష్ట్రపతి చాలా విషయాలను తన ప్రసంగంలో ప్రస్తావించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు, రాష్ట్రపతి విస్మరించిన విషయాలను ఆయన ఏకరువు పెట్టారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాగాలాండ్‌లో పౌరులను చంపేసిన ఘటనను ప్రస్తావించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ వివరించారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో మరణాలను ఆయన పేర్కొనలేదని తెలిపారు. అలాగే, జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంపైనా ఆయన మాట్లాడలేదని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడంపై.. తద్వార భారత్‌లో ఉగ్రవాద ముప్పు గురించీ ఆయన అసలు మాట్లాడనేలేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగాన్ని పేర్కొంటూ అన్నారు.

బడ్జెట్ సమావేశాల ప్రారంభం కానున్న సందర్భంగా ఆయన ఈ రోజు ఎగువ, దిగువ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగం సందర్భంగా రాష్ట్రపతి భారత స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకున్నారు. వారికి నివాళులు అర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనను కేంద్ర ప్రభుత్వం స్మరించుకుందని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో భారతీయులు ఒక టీమ్‌గా పని చేశారని వివరించారు. భారత్‌లో టీకా పంపిణీ కార్యక్రమం ప్రపంచ రికార్డులను నెలకొల్పిందని చెప్పారు. 90 శాతం మంది వయోధికులు కనీసం ఒక్క డోసు అయినా తీసుకుని ఉన్నారని పేర్కొన్నారు. ఎవరూ ఆకలితో నిద్రపోకుండా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించే పనిలో ప్రభుత్వం ఉన్నదని తెలిపారు.

ప్పట్లాగే బడ్జెట్ కంటే ముందు ప్రవేశపెట్టే ఎకనామిక్ సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాగా, రేపు ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. పార్లమెంటుల ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే పలు కీలక అంశాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) వృద్ధి రేటు 9.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 వృద్ధి రేటు 8 శాతం నుంచి 8.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ సర్వే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసిన వృద్ధి రేటు కంటే తక్కువగా ఉండటం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను భారత దేశంలో వృద్ధి రేటు 9 శాతం ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఉదయం పార్లమెంటులో ఎకనామిక్ సర్వే 2021-22ను ప్రవేశపెట్టారు. రేపు ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌