రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సర్జరీ

Published : Aug 19, 2021, 05:04 PM ISTUpdated : Aug 19, 2021, 05:05 PM IST
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సర్జరీ

సారాంశం

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో కాటరాక్ట్ సర్జరీ జరిగింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయినట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కంటి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ విజయవంతమైనట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్(రిఫరల్, రీసెర్చ్)‌లో కాటరక్ట్ సర్జరీ జరిగినట్టు తెలిపింది. ఆపరేషన్ సక్సెస్ అయిందని, అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయినట్టు వివరించింది.

‘భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఈ రోజు(ఆగస్టు 19) ఉదయం ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో కాటరక్ట్ సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతంగా ముగిసింది. అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యారు’ అని ఆ ప్రకటన వివరించింది.

75ఏళ్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛాతిలో సమస్యతో మార్చి నెలలో ఈ హాస్పిటల్‌కు వెళ్లిన సంగత తెలిసిందే. తర్వాత కూడా పలుసార్లు రోటీన్ టెస్టుల కోసం ఈ హాస్పిటల్ సందర్శించారు.

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో