ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల (Padma Awards) ప్రధానోత్సవం సోమవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) చేతుల మీదుగా పద్మ అవార్డులను ప్రధానోత్సవం జరిగింది.
ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల (Padma Awards) ప్రధానోత్సవం సోమవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) చేతుల మీదుగా 2020 సంవత్సరానికి ప్రకటించిన పద్మ అవార్డులను ప్రధానోత్సవం నేడు జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటి కంగనా రనౌత్, ఇతర అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు.సుష్మ స్వరాజ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఆమె కూతురు బన్సూరి స్వరాజ్ రాష్ట్రపతి నుంచి స్వీకరించారు.
భారత ప్రభుత్వం ప్రతి ఏడాది వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ అవార్డులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. 2020కి గానూ.. ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రులు దివంగత అరుణ్ జైట్లీ, సుష్మ స్వరాజ్, జార్జి ఫెర్నాండెజ్ లకు ప్రజా వ్యవహారాల విభాగంలో 'పద్మవిభూషణ్' ప్రకటించారు. మారిషస్ మాజీ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్, భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ లకు కూడా పద్మ విభూషణ్‌కు ఎంపిక చేశారు. ఇక, పద్మభూషణ్ అవార్డుల విషయానికొస్తే, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను విశిష్ట గౌరవం వరించింది. వినోద రంగం నుంచి కంగన రనౌత్, ఏక్తా కపూర్ లను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేశారు.
undefined
పద్మభూషణ్ కు ఎంపికైన 16 మంది
ఎం. ముంతాజ్ (కేరళ) ఆధ్యాత్మికం, సయ్యద్ మౌజం అలీ (బంగ్లాదేశ్) మరణానంతరం, ముజఫర్ హుస్సేన్ బేగ్ (జమ్మూ కాశ్మీర్), అజయ్ చక్రవర్తి (బెంగాల్) కళలు, మనోజ్ దాస్ (పుదుచ్చేరి) సాహిత్యం, విద్య, బాలకృష్ణ దోశి (గుజరాత్), కృష్ణమ్మల్ జగన్నాథన్ (తమిళనాడు) సామాజిక సేవ, ఎస్సీ జామీర్ (నాగాలాండ్), అనిల్ ప్రకాశ్ జోషి (ఉత్తరాఖండ్) సామాజిక సేవ, సేరింగ్ లండల్ (లద్ధాఖ్) వైద్యం, ఆనంద్ మహీంద్ర (మహారాష్ట్ర) వాణిజ్యం పరిశ్రమలు, పీవీ సింధు (క్రీడలు), నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (కేరళ) ప్రజా సంబంధాలు (మరణానంతరం), మనోహర్ పారికర్ (గోవా) మరణానంతరం, జగదీశ్ సేథ్ (అమెరికా) విద్య సాహిత్యం, వేణు శ్రీనివాసన్ (తమిళనాడు), వాణిజ్యం, పరిశ్రమలు
ఈ ఏడాది ఐదుగురు తెలుగు వ్యక్తులను పద్మ అవార్డులు దక్కాయి. క్రీడా విభాగంలో పీవీ సింధును పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి చిన్నతల వెంకట్ రెడ్డి (వ్యవసాయం), విజయసారథి శ్రీభాష్యం (విద్య, సాహిత్యం), ఏపీ నుంచి యడ్ల గోపాలరావు (కళలు), దలవాయి చలపతిరావు (కళలు)లను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. కాగా, పీవీ సింధుకిది రెండో పద్మ పురస్కారం. ఐదేళ్ల క్రితం 2015లో ఆమెకు పద్మశ్రీ దక్కింది.