కేంద్ర కేబినెట్ ‌విస్తరణ: ఊహించని ట్విస్ట్.. మంత్రి పదవికి రవిశంకర్ ప్రసాద్, జవదేకర్ రాజీనామా

By Siva KodatiFirst Published Jul 7, 2021, 5:59 PM IST
Highlights

కేంద్ర మంత్రి వర్గంలోని సీనియర్లు ఊహించని షాకులు ఇస్తున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో తొలుత కొద్ది మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అయితే అది వారితోనే ఆగిపోతుందని అందరూ భావించారు

కేంద్ర మంత్రి వర్గంలోని సీనియర్లు ఊహించని షాకులు ఇస్తున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో తొలుత కొద్ది మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అయితే అది వారితోనే ఆగిపోతుందని అందరూ భావించారు. కానీ... కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి కొద్ది నిమిషాల ముందు మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఇప్పటి వరకు రాజీనామాలు చేసిన వారి సంఖ్య 12 కు చేరింది. వీరందరి రాజీనామాలకు రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు. 

Also Read:కేంద్ర కేబినెట్ విస్తరణ: మోడీ కొత్త టీమ్‌.. ప్రమాణ స్వీకారం చేయనున్న 43 మంది వీరే..!!

అంతకుముందు సదానంద గైడ, థావర్ చంద్ గెహ్లాట్, రమేశ్ పోఖ్రియాల్, హర్షవర్థన్, సంతోష్ కుమార్ గాంగ్వార్, బాబుల్ సుప్రియో, ధోత్రి సంజయ్ శామ్‌రావ్, రతన్ లాల్ కటారియా, ప్రతాప్ చంద్ర సారంగి, దేబాశ్రీ చౌదరీలు తమ పదవులకు రాజీనామా  చేసిన సంగతి తెలిసిందే. 

 

ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ సహా రాజీనామా చేసిన 12 మంది కేంద్ర మంత్రులు pic.twitter.com/7jH2IUwUc3

— Asianetnews Telugu (@AsianetNewsTL)
click me!