ప్రభుత్వాసుపత్రి నిర్వాకం.. గర్భిణీకి హెచ్ఐవీ రక్తం

By ramya neerukondaFirst Published Dec 26, 2018, 11:38 AM IST
Highlights

ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఓ గర్భిణీకి హెచ్ఐవీ సోకింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఆమెకు హెచ్ఐవీ సోకిన వ్యక్తి రక్తం ఎక్కించారు.

ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఓ గర్భిణీకి హెచ్ఐవీ సోకింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఆమెకు హెచ్ఐవీ సోకిన వ్యక్తి రక్తం ఎక్కించారు. దీంతో.. ఆమెకు కూడా హెచ్ఐవీ సోకింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని విరుధునగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ నెల మొదటి వారంలో ఓ గర్భిణీ మహిళ చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో.. వైద్యులు ఎక్కించారు. ఆ తర్వాత పరీక్షలు చేయగా.. ఆమెకు హెచ్ఐవీ సోకినట్లు తేలింది. దీంతో.. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు.

రెండు సంవత్సరాల క్రితం.. ఓ వ్యక్తి రక్త దానం చేయగా.. అతనికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. అయితే.. ఆ విషయాన్ని సదరు డోనర్ కి చెప్పడంలో ల్యాబ్ టెక్నిషియన్స్ నిర్లక్ష్యం వహించారు. ఆ వ్యక్తి రక్తమే ఈ మహిళకు ఎక్కించడంతో ఈ పొరపాటు చోటుచేసుకుంది.

దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు ల్యాబ్ టెక్నిషియన్స్ ని విధుల నుంచి తొలగించారు. జరిగిన పొరపాటుకి పరిహారంగా... బాధిత మహిళకు, ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే.. తమకు ఉద్యోగం కాదని.. ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.

click me!