
గర్భిణికి ఆసుపత్రిలో ఏసీ గది ఏర్పాటు చేయలేదంటూ ఆమె పుట్టింటి వారు .. అత్తింటి వారిపై దాడికి తెగబడ్డారు. ఆసుపత్రి గేటు బయట గర్బిణి స్త్రీ బంధువులు .. ఆమె అత్తమామాలను, భర్తను తీవ్రంగా గొడవపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి లో వెలుగులోకి వచ్చింది. దీని వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. సమాచారం ప్రకారం.. కొత్వాలి ప్రాంతంలోని సివిల్ లైన్స్‌లో ఉన్న ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ముందు ఈ ఘటన జరిగింది. లక్నో జిల్లాలోని ఫైజుల్లాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీగంజ్‌లో కుమారుడికి వివాహం జరిగిందని, ఆవాస్-వికాస్ కాలనీకి చెందిన రామ్‌కుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోడలు ప్రసవం కోసం.. ఆమె సివిల్ లైన్ వద్ద ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు ఒక కుమార్తె జన్మించింది. ఆసుపత్రిలో అయ్యే ఖర్చులను యువతి తరుపున వారే చెల్లిస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం కూతురిని చూసేందుకు యువతి తరఫు తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకోగా.. ఏసీ లేని గదిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ రూం బుక్ చేయనందుకు తనను దుర్భాషలాడాడని రామ్‌కుమార్ ఆరోపించారు. ఈ క్రమంలో తనని, తన భర్త, ఇద్దరు కుమార్తెలను తీవ్రంగా కొట్టారు. యువతి తండ్రి, కొడుకు, బంధువులు ఆస్పత్రి వెలుపల నడిరోడ్డుపై అబ్బాయి సోదరి,తల్లిదండ్రులపై దాడి చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఘటన అనంతరం అత్తమామలు తన కోడలి తల్లిదండ్రులు, సోదరుడుపై ఫిర్యాదు చేశారు. మరోవైపు.. ఈ మొత్తం వ్యవహారంలో కుటుంబ ఫిర్యాదు వచ్చిందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ సంజయ్ మౌర్య తెలిపారు.