గర్భంతో ఉన్న అటవీశాఖ ఉద్యోగినిపై మాజీ సర్పంచ్ పైశాచిక దాడి.. సహకరించిన భార్య..

By SumaBala BukkaFirst Published Jan 21, 2022, 1:21 PM IST
Highlights

ఆమె గర్భంతో ఉందని కూడా చూడకుండా తన భార్యతో కలిసి దాడి చేశాడు. బూటు కాలుతో కడుపు మీద తన్నాడు. బాధితురాలు ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. ఈ ఘటన మీద మంత్రి ఆదిత్య ఠాక్రే తీవ్రంగా స్పందించారు. ఉద్యోగుల మీద దాడులు సహంచబోమని, బాధితురాలికి జరగకూడనిది జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 

మహారాష్ట్ర : Maharashtra లో దారుణం జరిగింది. అధికారమదంతో ఓ అధికారి గర్భిణి అని కూడా చూడకుండా.. మహిళా ఉద్యోగి మీద పైశాచికంగా దాడి చేశాడు. దీనికి అతని భార్య కూడా సహకరించడం దారుణం.  pregnancyతో ఉన్న అటవీ శాఖ ఉద్యోగిని మీద గ్రామ మాజీ సర్పంచి, అతని భార్య కలిసి attack చేశారు. 

Maharashtraలోని సతారా జిల్లా పల్సనాడే గ్రామంలో ఈ దారుణం జరిగింది. నిందితుడు స్థానికంగా అటవీ నిర్వహణ కమిటీలో సభ్యుడు. గతంలో Sarpanch గా కూడా పనిచేశాడు. తన అనుమతి లేకుండా Contract employeeలను వెంట తీసుకు వెళ్లారనే కోపంతో Forest Department Female Guard మీద కోపోద్రిక్తుడయ్యాడు. 

ఆమె గర్భంతో ఉందని కూడా చూడకుండా తన భార్యతో కలిసి దాడి చేశాడు. బూటు కాలుతో కడుపు మీద తన్నాడు. బాధితురాలు ప్రస్తుతంThree months pregnant. ఈ ఘటన మీద మంత్రి ఆదిత్య ఠాక్రే తీవ్రంగా స్పందించారు. ఉద్యోగుల మీద దాడులు సహంచబోమని, బాధితురాలికి జరగకూడనిది జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, జనవరి 7న తెలంగాణ జిల్లా మంచిర్యాలలో ఓ నిండు గర్భిణ ఉరేసుకుని చనిపోయింది. మళ్లీ girl child పుడుతుందేమో అనే Suspicionతో ఓ నిండు Pregnant ఉరివేసుకుని Suicide చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన Manchiryalaలో చోటుచేసుకుంది. 

మృతురాలి కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం నర్సాపూర్ కు చెందిన రమ్యను మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఆనంద్ కు ఇచ్చి 2017 లో వివాహం చేశారు. వీరి సంసార జీవితంలో మొదటగా ఆరాధ్య(3) జన్మించింది. ప్రస్తుతం రమ్య 9 నెలల గర్భిణీ. గురువారం ఆమెకు వైద్యులు డెలివరీ డేటును ఖరారు చేశారు. 

అయితే, తనకు మొదట ఆడపిల్ల పుట్టిందని.. ఇప్పుడు కూడా అమ్మాయే పుడుతుందేమోనని గత కొద్ది రోజులుగా రమ్య దిగులు పడుతోంది. అయితే ఈ విషయం గమనించిన భర్త ఆడపిల్లయినా, మొగ పిల్లవాడైన ఏమీ కాదని నచ్చచెప్పేవాడు. భర్తతోపాటు అత్తింటివారు, పుట్టింటి వారు కూడా అదే విషయం నచ్చజెప్పేవారు. కానీ రమ్య ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి ఆమెను తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ‘ఎంత పని చేస్తివి బిడ్డా..’ అంటూ మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏడుస్తున్న తీరుతో జిల్లా ఆస్పత్రి దద్దరిల్లింది. 

అది చూస్తున్న స్థానికులను కలచివేసింది. ఈ కాలంలో కూడా ఆడపిల్ల పుడుతుంది అనే అనుమానంతో తనువు చాలించడం ఏంటని అయిన వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ తెలిపారు. 

click me!