kumbhmela stampede : మౌని అమావాస్య తొక్కిసలాటపై విచారణ షురూ... రంగంలోకి రిటైర్డ్ జడ్జి టీమ్

Published : Jan 31, 2025, 11:25 PM IST
kumbhmela stampede : మౌని అమావాస్య తొక్కిసలాటపై విచారణ షురూ... రంగంలోకి రిటైర్డ్ జడ్జి టీమ్

సారాంశం

kumbhmela stampede : మహా కుంభమేళాలో మౌని అమావాస్య స్నానం రోజు జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణ మొదలయ్యింది. ఇది ఎలా సాగుతుందంటే... 

kumbhmela stampede : మహా కుంభమేళాలో మౌని అమావాస్య స్నానం రోజు జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ ప్రారంభమయ్యింది.యోగి సర్కార్ నియమించిన ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిషన్ తన పనిని వేగవంతం చేసింది. కమిషన్ అధ్యక్షులు, రిటైర్డ్ న్యాయమూర్తి హర్ష్ కుమార్ శుక్రవారం ప్రయాగరాజ్‌లో అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత కమిషన్ సంగమ ప్రాంతంలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. సంఘటనా స్థలం యొక్క స్థలాకృతి, పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు కమిషన్ అధ్యక్షులు జస్టిస్ హర్ష్ కుమార్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను లోతుగా విశ్లేషిస్తామని చెప్పారు.

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో మౌని అమావాస్య స్నానం రోజు జనాలు సముద్రంలా ఉప్పొంగడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో 30 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిషన్‌ను నియమించారు. అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి హర్ష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిషన్‌లో రిటైర్డ్ ఐఏఎస్ డి.కె. సింగ్, రిటైర్డ్ ఐపీఎస్ వి.కె. గుప్తా సభ్యులుగా ఉన్నారు. కమిషన్ నెలలోపు తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం కమిషన్ తొక్కిసలాటకు కారణాలు, పరిస్థితులను పరిశీలిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సూచనలు చేస్తుంది.

సంఘటనా స్థలం పరిశీలన 

ఘటన జరిగిన తీరు, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులపై అధికారుల నుంచి కమిషన్ సభ్యులు సమాచారం సేకరించారు. ఇది ఆకస్మిక దుర్ఘటన అయినప్పటికీ, దీని వెనుక ఉన్న కారణాలను క్రమపద్ధతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు జస్టిస్ హర్ష్ కుమార్ తెలిపారు. సంఘటనా స్థల పరిశీలన పూర్తయిందని, అయితే ఇంకా ఏవయినా పరిశీలించాల్సిన అవసరం ఉంటే మళ్లీ వస్తామని చెప్పారు.

కమిషన్ సభ్యులు డికె సింగ్,  వికె గుప్తా కూడా విచారణను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. తమకు ఒక నెల మాత్రమే సమయం ఉందని, అయితే విచారణను ప్రాధాన్యతగా తీసుకుని త్వరగా పూర్తి చేస్తామని కమిషన్ అధ్యక్షుడు చెప్పారు. విచారణ ప్రక్రియ వల్ల మహా కుంభమేళాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని అన్నారు. అన్ని వాస్తవాలను లోతుగా విశ్లేషించి కమిషన్ ఒక నిర్ణయానికి వస్తుంది.

గాయపడిన వారి నుంచి సమాచారం సేకరణ

గాయపడిన వారిని ఆసుపత్రిలో కలిసి మాట్లాడాలని కమిషన్ యోచిస్తోంది. గాయపడిన వారి నుంచి వచ్చే సమాచారం విచారణకు సరైన దిశానిర్దేశం చేస్తుందని జస్టిస్ హర్ష్ కుమార్ అన్నారు. ఒక అంశంపై దృష్టి పెట్టకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇంతకు ముందు కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు గురువారం లక్నోలోని జన్‌పథ్‌లో ఉన్న తమ కార్యాలయంలో పని ప్రారంభించారు. విచారణను ప్రాధాన్యతగా తీసుకోవాలని, అందుకే ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే బాధ్యతలు స్వీకరించినట్లు కమిషన్ అధ్యక్షులు జస్టిస్ హర్ష్ కుమార్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం