మహా కుంభమేళాకు ప్రయాగరాజ్ సిద్దం... యోగి సర్కార్ అదిరిపోయే ఏర్పాట్లు

By Arun Kumar PFirst Published Oct 16, 2024, 1:19 PM IST
Highlights

ప్రయాగరాజ్‌లో 2025 మహాకుంభ్ కోసం 39 కొత్త ట్రాఫిక్ జంక్షన్లు నిర్మిస్తున్నారు. ఈ జంక్షన్లు ట్రాఫిక్‌ను సులభతరం చేయడమే కాకుండా నగర సౌందర్యాన్ని కూడా పెంచుతాయి.

ప్రయాగరాజ్ : ప్రయాగరాజ్‌ మహా కుంభమేళ కోసం యోగి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళకు వచ్చే పర్యాటకులు, భక్తులకు అద్భుత అనుభూతిని కలిగించేలా   సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ''ప్రాజెక్ట్ కుంభ్ నగరి'' అమలు చేస్తున్నారు.

39 ట్రాఫిక్ జంక్షన్ల నిర్మాణం

Latest Videos

కుంభమేళాకు విచ్చేసే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్లపై ప్రత్యేక శ్రద్ద చూపుతోంది యూపీ ప్రభుత్వం. అలాగే నగరంలో ట్రాఫిక్ వ్యవస్థకు కొత్త రూపు ఇస్తున్నారు.ఇందులో భాగంగానే మొదటిసారిగా నగరంలో 39 ట్రాఫిక్ జంక్షన్లను నిర్మిస్తున్నారు.

కుంభమేళా ప్రత్యేక అధికారి వివేక్ చతుర్వేది మాట్లాడుతూ ... మహా కుంభమేళాకు ముందు నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపర్చేందుకే ప్రయాగరాజ్ లో 39 ట్రాఫిక్ జంక్షన్లను నిర్మిస్తున్నామని చెప్పారు. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో వీటి నిర్మాణం జరుగుతోందని... దీనికి సంబంధించిన టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ట్రాఫిక్ జంక్షన్ల నిర్మాణానికి ముందు ఒక ఏజెన్సీ ద్వారా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను సర్వే చేయించామని... ఆ తర్వాత ఈ జంక్షన్ల డిజైన్‌ను రూపొందించినట్లు వివేక్ చతుర్వేది తెలిపారు..

నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను స్మార్ట్‌గా మార్చడానికి మొదటిసారిగా నిర్మిస్తున్న ఈ జంక్షన్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.  ట్రాఫిక్‌ను సులభంగా నియంత్రించే విధంగా వీటిని రూపొందించారు.  ఈ ట్రాఫిక్ జంక్షన్లలో ఐలాండ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

జంక్షన్లలో స్మార్ట్ సిగ్నల్ ట్రాఫిక్ వ్యవస్థ ఉంటుంది, ఇది పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. జంక్షన్లకు అందమైన రూపం ఇవ్వడానికి మిగిలిన స్థలంలో శిల్పాలు, ఆకర్షణీయమైన లైట్లను కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే చిన్న అలంకార మొక్కలను నాటుతారు.

ట్రాఫిక్ జంక్షన్లు కుంభమేళాకు వచ్చే పర్యాటకులు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేస్తున్నారు. కుంభమేళా ముగిసిన తర్వాత కూడా ప్రయాగరాజ్ లో ట్రాఫిక్ వ్యవస్థను నియంత్రించడంలో వీటి ప్రయోజనం కొనసాగుతుంది.

click me!