రబ్రీదేవి ఆరోపణలకు ప్రశాంత్ కిశోర్ కౌంటర్

Published : Apr 13, 2019, 11:45 AM IST
రబ్రీదేవి ఆరోపణలకు ప్రశాంత్ కిశోర్ కౌంటర్

సారాంశం

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కౌంటర్ ఇచ్చారు.

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీని జేడీయూ కలపాలంటూ ప్రశాంత్ కిశోర్ తమ ఇంటికి వచ్చి అడిగారంటూ రబ్రీదేవి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... దీనిపై ఈరోజు ప్రశాంత్ కిశోర్ స్పందించారు.

తన గురించి, తన రాజకీయ వ్యవహారాల గురించి బిహార్ లో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికారం, ప్రభుత్వ నిధులను  దుర్వినియోగం చేసిన కేసుల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్నావారు తమను సత్యానికి సంరక్షకులమని  చెప్పుకుంటున్నారని సెటైర్లు వేశారు.

కాగా.. ‘సీఎం నితీశ్‌ తరఫున ప్రశాంత్‌ మమ్మల్ని కలిశారు. రెండు పార్టీలను విలీనం చేసి, ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని చెప్పారు. ఒక సందర్భంలో నాకు బాగా కోపం వచ్చి ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని కోరా’ అని రబ్రీ దేవి ఆరోపించిన సంగతి తెలిసిందే. 
 

ప్రశాంత్ కిశోర్ పై మాజీ సీఎం భార్య సంచలన ఆరోపణలు

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..