కోర్టు ధిక్కరణ కేసు: సుప్రీంలో రూపాయి డిపాజిట్ చేసిన ప్రశాంత్ భూషణ్

By narsimha lodeFirst Published Sep 14, 2020, 2:44 PM IST
Highlights

తనకు విధించిన ఒక్క రూపాయి జరిమానాను ప్రముఖ లాయర్, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ సోమవారం నాడు సుప్రీంకోర్టులో డిపాజిట్ చేశారు.
 


న్యూఢిల్లీ: తనకు విధించిన ఒక్క రూపాయి జరిమానాను ప్రముఖ లాయర్, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ సోమవారం నాడు సుప్రీంకోర్టులో డిపాజిట్ చేశారు.

కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు రూపాయి జరిమానాను విధిస్తూ ఈ ఏడాది ఆగష్టు 31వ తేదీన తీర్పు చెప్పింది. ఈ తీర్పు మేరకు ప్రశాంత్ భూషణ్ ఇవాళ రూపాయిని కోర్టులో డిపాజిట్ చేశారు. ఈ నెల 15వ తేదీ లోపుగా జరిమానాను చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రశాంత్ భూషణ్ ఇవాళ సుప్రీంకోర్టులో రూపాయిని డిపాజిట్ చేశారు.

రూపాయి జరిమానాను చెల్లించినందున తాను కోర్టు తీర్పును అంగీకరించినట్టు కాదని ఆయన చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ ను కూడ దాఖలు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు.

కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు విధించిన రూపాయి జరిమానాను చెల్లించకపోతే మూడు మాసాల పాటు జైలు శిక్షను విధించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.జేఎన్‌టీయూ స్టూడెంట్ ఉమర్ ఖలీద్ ను ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్ట్ చేయడంపై ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

click me!