జిల్లా కలెక్టర్ గా అంధురాలు.... అందరికీ ఆదర్శం ఈ ప్రాంజల్

By telugu teamFirst Published Oct 15, 2019, 7:50 AM IST
Highlights

తిరువనంతపురం సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పట్టుదలతో కష్టపడి చదివి సాధించిన విజయాలు ఇవి. ఫలితంగా దేశంలోనే మొట్టమొదటి అంధ ఐఏఎస్‌ అధికారిణిగా ప్రాంజల్‌ రికార్డుల్లోకెక్కారు. 2018 నుంచి ఇప్పటివరకు ఎర్నాకుళంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు.

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదూ అంటూ పెద్దవాళ్లు చెబుతుంటారు. అవన్నీ మనం వింటూనే ఉంటాం.... కానీ ఆచరణలో చేసిచూపం. కానీ నిజంగా పట్టుదల ఉంటే... లోపాన్ని కూడా జయించవచ్చని ఓ యువతి నిరూపించింది. శరీరంలో అన్ని భాగాలు సరిగా పనిచేస్తున్నవాళ్లే చాలా మంది ఏ పనీ చేయకుండా బతుకు ఈడుస్తున్నారు. కానీ ఓ యువతి మాత్రం తనకు కళ్లు పోయినా... అవి లేవని ఏ రోజు బాధపడలేదు. తాను ఏ పని చేయలేను అని కూడా భావించలేదు. కష్టపడి జిల్లా కలెక్టర్ గా ఎదిగింది. ఆమె ప్రాంజల్ పాటిల్.

ఆరేళ్ల వయస్సులోనే చూపు కోల్పోయిన ప్రాంజల్‌ పాటిల్‌ అత్యంత కఠినమైన సివిల్‌ సర్వీసె్‌సలో మొదటి ప్రయత్నంలోనే 773వ ర్యాంకు సాధించారు. మరో ప్రయత్నంలో 124వ ర్యాంకు సాధించారు. సోమవారం తిరువనంతపురం సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పట్టుదలతో కష్టపడి చదివి సాధించిన విజయాలు ఇవి. ఫలితంగా దేశంలోనే మొట్టమొదటి అంధ ఐఏఎస్‌ అధికారిణిగా ప్రాంజల్‌ రికార్డుల్లోకెక్కారు. 2018 నుంచి ఇప్పటివరకు ఎర్నాకుళంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు.

ప్రాంజల్ మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో జన్మించారు. పుట్టుకతోనే ఆమెకు పాక్షిక అంధత్వం ఉంది. ఆమె కంటిచూపు పూర్తిగా పోవచ్చునని డాక్టర్లు ఆమె తల్లిదండ్రులకు ముందే చెప్పారు. కానీ.. అది చాలా ముందుగానే సంభవించింది. ఆమె రెండో తరగతి చదువుతున్నపుడు.. ఓ సహ విద్యార్థి పెన్సిల్‌తో ఆమె కంట్లో పొడిచాడు. ఆమె పూర్తిగా కంటిచూపు కోల్పోయారు.

అయినా కానీ.. ప్రాంజల్ సాధారణ స్కూల్‌లో చదువు కొనసాగించారు. తర్వాత పరిస్థితిలు చాలా కష్టంగా మారాయి. ఆమెను బద్లాపూర్‌లోని ఒక స్కూల్‌లో చేర్చారు. అక్కడి వాతావరణంలో ఆమె ఇమడలేకపోయారు. దీంతో ఆమెను ముంబైలోని దాదర్‌లో గల కమలాబాయి మెహతా స్కూల్‌లో చేర్చారు. అక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు అదే స్కూల్లో ఉండేది. కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే ఆమె ఇంటికి వచ్చేది అని ఆమె తండ్రి ఎల్బీ పాటిల్ చెప్పారు.

 హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ (హెచ్ఎస్‌సీ) పరీక్షల్లో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఘనత ప్రాంజల్ పాటిల్ ది. హెచ్ఎస్‌సీ తర్వాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఆమె చేరారు. అంధుల కోసం అవసరమైన సదుపాయాలన్నీ ఆ కాలేజీలో ఉన్నాయి. ప్రాంజల్ విశ్వవిద్యాలయం స్థాయిలో ఫస్ట్ ర్యాంక్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.

2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్‌ సాధించారు.దీంతో ఆమెకు భారత రైల్వే అకౌంట్స్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఏఎస్‌)లో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు. పట్టు వదలని ప్రంజల్‌ తర్వాతి యేడు జరిగిన యూపీఎస్సీ పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్‌ సాధించారు. దీంతో ఆమె ఐఏఎస్‌గా ఎంపికై, యేడాది శిక్షణలో భాగంగా ఎర్నాకులం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు.

రైల్వే ఉద్యోగం తిరస్కరణకు గురికావడంపై తానెంతో వేదనకు గురయ్యానని ఓ సందర్భంలో తెలిపారు. కళ్లకు చేసిన శస్త్రచికిత్స విఫలమైనందు వల్ల కూడా నొప్పిని అనుభవించానని తెలిపారు. తిరువనంతపురంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమంలో సామాజిక న్యాయ విభాగం సెక్రటరీ బిజు ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఇప్పుడు ఏకంగా ఓ జిల్లాకి సబ్ కలెక్టర్ అయ్యారు. పరీక్షల సమయంలో రికార్డు చేసిన ఆడియో టేపులను ఇయర్ ఫోన్స్ ద్వారా విని.. పరీక్షలు రాయడం గమనార్హం. 


 

click me!