మునిగిపోతుంటే కాపాడాల్సిందిపోయి... రాహుల్ గాంధీపై అసదుద్దీన్ సంచలన కామెంట్స్

By telugu teamFirst Published Oct 15, 2019, 7:27 AM IST
Highlights

సముద్రం మధ్యలో పడవ మునిగిపోయే పరిస్థితి వస్తే... కెప్టెన్ అనేవాడు... అందులోని వాళ్లను కాపాడాలని ప్రయత్నిస్తారని అసదుద్దీన్ పేర్కొన్నారు. కానీ...  రాహుల్ గాంధీ మాత్రం తన వాళ్లను కాపాడకుంటే.. ముందుగా అతనే పారిపోయాడంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు.  రాహుల్ గాంధీపై మాటల దాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీ అనే పడవ మునిగిపోతోంటే.. కెప్టెన్ గా... వాళ్లను కాపాడాల్సింది పోయి.. ముందు ఆయనే పారిపోయాడంటూ... అసదుద్దీన్ సంచలన ఆరోపణలు చేశాడు.

బెవాడీ పశ్చిమ నియోజకవర్గంలో తమ ఏఐఎంఐఎం పార్టీ నేత ఎన్నికల బరిలో నిలబడగా... అతని తరపున ప్రచారం చేయడానికి అసదుద్దీన్ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ అనే నావ ఎప్పుడో మునిగిపోయిందన్నారు.

సముద్రం మధ్యలో పడవ మునిగిపోయే పరిస్థితి వస్తే... కెప్టెన్ అనేవాడు... అందులోని వాళ్లను కాపాడాలని ప్రయత్నిస్తారని అసదుద్దీన్ పేర్కొన్నారు. కానీ...  రాహుల్ గాంధీ మాత్రం తన వాళ్లను కాపాడకుంటే.. ముందుగా అతనే పారిపోయాడంటూ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ ఓటమి బాధ్యత వహిస్తూ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ తప్పుకున్నారు. రాహుల్ అలా తప్పుకోవడాన్ని తప్పుపడుతూ అసదుద్దీన్ ఇలా కామెంట్స్ చేశారు.

ముస్లింలకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ ఈ దేశంలో ముస్లింలు బతికి ఉన్నారంటే అది కేవలం రాజ్యాంగం, దేవుడి దయ వల్లనే అని ఆయన అన్నారు. కాగా ఈ ఎన్నికల సభకు వేలసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

ఇదిలా ఉండగా... ఇటీవల కూడా అసుద్దీన్... దేశం గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. భారతదేశం ఎప్పటికీ హిందూ దేశం కాదని.. కాబోదని ఎంపీ అసదుద్దీన్ చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా స్పందించిన అసముద్దీన్ భారత్ హిందూ రాష్ట్రం కాదు.. కాబోదని, చరిత్ర చదివినా ఈ విషయం బోధపడుతుందన్నారు. 

‘భాగవత్.. నా చరిత్రను నువ్వు చెరిపివేయలేవు. హిందూ రాష్ట్ర అనేది జరగని పని. మన సంస్కృతులు, విశ్వాసాలు, మతాలు, వ్యక్తిగత గుర్తింపులు అన్నీ హిందూమతం చేయాలనుకోవడం ఆయన పట్టుబట్టలేరు. భారత్ గతంలో హిందూ రాష్ట్రం కాదు. ప్రస్తుతమూ కాదు. ఇకపై కూడా కాబోదు’ అని ట్వీట్ చేశారు. దీనికి తోడు మోహన్ భాగవత్ ప్రసంగిస్తున్న వీడియోను షేర్ చేశారు. కాగా.. ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. 
 

click me!