
పనాజీ: గోవా సీఎంగా Pramod Sawant ను కొనసాగించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.Goa CMగా ఆయన రెండోసారి ప్రమాణం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గోవా సీఎంగా ఎవరికి బాధ్యతలు ఇస్తారనే విషయమై కొంత కాలంగా సాగిన ఉత్కంఠకు తెరపడింది.
కేంద్ర మంత్రి Narendra Singh Tomar సహా పలువురు సీనియర్లు ఇవాళ గోవాకు వచ్చారు. బీజేపీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో బీజేపీ శాసనసభపక్ష నేతగా ప్రమోద్ సావంత్ ను ఎంపిక చేశారు.
గోవా సీఎంగా తనను రెండోసారి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టినందుకు ప్రధాని మోడీకి, కేంద్ర నాయకత్వానికి ప్రమోద్ సావంత్ చెప్పారు.తనను నమ్మిన పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.
గోవాలో పార్టీ శాసనసభపక్ష నేత ఎంపిక కోసం గోవా ఎన్నికల ఇంచార్జీ దేవేంద్ర ఫడ్నవీస్, సిటి రవి, సదానంద్ తనవడే, శ్రీపాద్ నాయక్ తదితరులు హాజరయ్యారు.గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీకి 20 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కు 12, టీఎంసీకి 2, ఆప్ పార్టీకి 2, ఇతరులకు నాలుగు స్థానాలు దక్కాయి.
గోవాలో ఫిబ్రవరి 14న జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 79%గా నమోదైంది.
అత్యధికంగా సీఎం ప్రమోద్ సావంత్ పోటీ చేసిన నియోజకవర్గంలో 89.64 శాతంగా రికార్డ్ అయింది. అయితే,ఈ సారి పోలింగ్ శాతం గత ఎన్నికల్లో(81.21శాతం) కంటే తగ్గింది.
గోవాలో అధికారంలో బీజేపీ ఉన్నది. సీఎంగా ప్రమోద్ సావంత్ ఉన్నారు. ఆయన గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచే మరోసారి బరిలోకి దిగారు. కాగా, గోవా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ మరణం తర్వాత ఆయన కుమారుడు ఉత్పల్ పారికర్ తండ్రి పోటీ చేసిన పనాజీ నుంచే బరిలోకి దిగారు. పనాజీ నుంచి బీజేపీ
ఆయనకు టికెట్ నిరాకరించడంతో స్వతంత్రంగా పోటీ చేశారు. కాంగ్రెస్ సీఎం ఫేస్‌ను ఇంకా ప్రకటించలేదు. ఆప్ మాత్రం అమిత్ పాలేకర్‌ను సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించింది.
రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచే కాకుండా, స్వతంత్రంగా 301 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక్కడ బీజేపికి కాంగ్రెస్, మహారాష్ట్రవాది గోమంత్ పార్టీ, టీఎంసీ, ఆప్ పార్టీలు తలపడ్డాయి.
గోవా రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల బెడద ఎక్కువ. ఇక్కడ పార్టీల కంటే రాజకీయ నేతలకే ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. నియోజకవర్గాలు చిన్నగా ఉండటంతో నేతలకే ప్రజలతో నేరుగా ఉండే సంబంధాలు ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ, 13 సీట్లు గెలుపొందిన బీజేపీ అధికారాన్ని చేపట్టింది.
తొలుత చిన్న పార్టీలతో జత కట్టి బీజేపీ అధికారాన్ని చేపట్టగా.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచే పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 19కు చేరగా కాంగ్రెస్ పార్టీఎమ్మెల్యేల సంఖ్య 2కు పడిపోయింది. ఇదిలా ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ ఈ రాష్ట్రంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా ఇక్కడ ప్రచారం చేయడం గమనార్హం. ఆప్ కూడా గోవాలో ప్రచారం ముమ్మరంగా చేపట్టింది.