కరుణానిధిపై పుస్తకం రాశానంటున్న ప్రకాష్ రాజ్

By rajesh yFirst Published Aug 30, 2018, 3:57 PM IST
Highlights

 దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని నటుడు ప్రకాష్ రాజు. ఏ పాత్రలోనైనా జీవించే ప్రకాష్ రాజ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్నాళ్లు వెండితెరపై సందడి చేసిన ప్రకాష్ రాజ్ తాజాగా కలం పట్టి రచయితగా మారారు. ద్రవిడ ఉద్యమనేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిపై ఓ పుస్తకాన్ని కూడా రాశారు.   

తమిళనాడు: దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని నటుడు ప్రకాష్ రాజు. ఏ పాత్రలోనైనా జీవించే ప్రకాష్ రాజ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్నాళ్లు వెండితెరపై సందడి చేసిన ప్రకాష్ రాజ్ తాజాగా కలం పట్టి రచయితగా మారారు. ద్రవిడ ఉద్యమనేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిపై ఓ పుస్తకాన్ని రాశారు.   

 కలైంజ్ఞర్ కరుణానిధిపై రాసిన పుస్తకం గురించి తాను ఇప్పుడు ఏమీ చెప్పదలచుకోలేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. కరుణానిధి గురించి తెలిసినంత వరకు కన్నడ వెర్షన్‌లో పుస్తకం రాశానని తెలిపారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇరువర్‌ అనే చిత్రంలో కరుణానిధి పాత్ర పోషించినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. అందరు చూసే కోణంలో కాకుండా నేను ఆయనను వేరే విధంగా చూశానన్నారు. 

అప్పటి నుంచి ఆయనపై పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చిందని, ఇన్నాళ్లకు అది నెరవేరిందన్నారు. ఇప్పటికే కన్నడ వెర్షన్‌లో ఈ పుస్తకాన్ని రాయడం పూర్తయిందన్న ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తమిళ వెర్షన్‌లో రాయడం ప్రారంభించానని తెలిపారు.

ప్రకాశ్‌ రాజ్‌ ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే తెలుగులో ఆయన నటించిన శ్రీనివాస కల్యాణం చిత్రం మంచి టాక్ అందుకుంది. అలాగే తమిళంలో చెక్కా చీవందవాణం అనే చిత్రంలో నటిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువర్ చిత్రం తెలుగులో నవాబ్‌ గా రానుంది.

click me!