ప్రధానిమోదీపై నటుడు ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు.. అదో జబ్బు అంటూ సంచలన వ్యాఖ్యలు..

Published : Mar 23, 2022, 12:23 PM IST
ప్రధానిమోదీపై నటుడు ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు.. అదో జబ్బు అంటూ సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని, 22 గంటలు పనిమీదే ధ్యాస అంటూ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలమీద ప్రకాశ్ రాజ్ సెటైర్లు వేశారు. నిద్ర తక్కువగా పోవడం అనేది జబ్బు అంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు.

నటుడు Prakash Raj ప్రధాన మంత్రి Narendra Modiపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ social media వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఓ సమావేశంలో చంద్రకాంత్ పాటిల్ ప్రధాని మోదీ రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటలపాటు ఆయన పనిచేస్తుంటారని అన్న వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సెటైరికల్ గా స్పందించాడు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ‘దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. నిద్రలేకపోవడం అనేది ఓ జబ్బు, వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి. అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకాష్ రాజ్ ప్రదాని మోదీ, బీజేపీ నేతల మీద విమర్శలు గుప్పిస్తుంటాడనే విషయం తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Online Orders : వీడు మామూలోడు కాదు.. లక్ష రూపాయల కండోమ్స్ ఏం చేశావు గురూ..!
కిసాన్ పాఠశాలలు.. ఇక రైతులకు ఆధునిక వ్యవసాయ పాఠాలు