ప్రజ్వల్ రేవణ్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 30 ఏళ్ల వయసులోనే ఎంపీగా గెలిచిన ఆయన.. తాత, తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2014లో బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తన తాతన దేవెగౌడకు సహాయం చేయడానికి ప్రజ్వల్.. ఆస్ట్రేలియాలో తన ఎంటెక్ కోర్సును మధ్యలోనే వదిలేశాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మనవడి పొలిటికల్ ఎంట్రీ కోసం దేవెగౌడ తన కంచుకోట హసన్‌ను వదులుకుని తుమకూరు నుంచి పోటీ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి హసన్ బరిలో నిలిచిన ప్రజ్వల్ తన ఆస్తులను రూ.40.85 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ కుటుంబంలో మూడో తరం రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు కుమారస్వామి, రేవణ్ణలతో పాటు మనవళ్లు నిఖిల్ , ప్రజ్వల్‌లు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. వీరిలో ప్రజ్వల్ రేవణ్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 30 ఏళ్ల వయసులోనే ఎంపీగా గెలిచిన ఆయన.. తాత, తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తన కుటుంబానికి పట్టున్న హసన్ లోక్‌సభ స్థానం నుంచి 2019లో ఘన విజయం సాధించిన ప్రజ్వల్ .. 2024లోనూ మరోసారి తలపడుతున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ బాల్యం, విద్యాభ్యాసం:
ప్రజ్వల్ రేవణ్ణ.. రేవణ్ణ, భవానీ రేవణ్ణ దంపతులకు 5 ఆగస్ట్ 1990న కర్ణాటకలోని హసన్‌లో జన్మించారు. ఈయన భారతదేశంలో పిన్న వయస్సులోనే ఎంపీగా గెలుపొందిన వారిలో 3వ వ్యక్తి. 2014లో బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తన తాతన దేవెగౌడకు సహాయం చేయడానికి ప్రజ్వల్.. ఆస్ట్రేలియాలో తన ఎంటెక్ కోర్సును మధ్యలోనే వదిలేశాడు. 2015లో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఎంపిక చేసిన భారత్‌లోని పది మంది ఔత్సాహిక రాజకీయ నాయకులలో ప్రజ్వల్ ఒకరు.
జనతాదళ్ (సెక్యులర్) సభ్యుడు అయినప్పటికీ 2018 కర్ణాటక విధానసభ ఎన్నికల్లో జేడీఎస్ టికెట్ నిరాకరించడంతో ప్రజ్వల్ రాజకీయాల్లోకి రావడం ఆలస్యమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నుంచి తన తాత దేవెగౌడ పోటీ చేయాలని ప్రజ్వల్ కోరుకున్నారు. అయితే మనవడి పొలిటికల్ ఎంట్రీ కోసం దేవెగౌడ తన కంచుకోట హసన్‌ను వదులుకుని తుమకూరు నుంచి పోటీ చేశారు. కానీ దురదృష్టవశాత్తూ హసన్‌లో ప్రజ్వల్ విజయం సాధించగా.. తుమకూరులో దేవెగౌడ ఓటమి పాలయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రజ్వల్ .. 12 గంటల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దేవెగౌడ వారించడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణపై అనర్హత వేటు :
ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజ్వల్ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచినందుకు గాను రేవణ్ణ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు సంచలన ప్రకటన చేసింది. అలాగే ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. అయితే ప్రజ్వల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం .. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి హసన్ బరిలో నిలిచిన ప్రజ్వల్ తన ఆస్తులను రూ.40.85 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో చరాస్తులు రూ.5.45 కోట్లు, స్థిరాస్తులు రూ.35.84 కోట్లుగా తెలిపారు.