ఏపీ నుండి కోడిగుడ్ల దిగుమతి: ఒడిశా పౌల్ట్రీ రైతుల ఆందోళన, రోడ్డుపైనే నిలిచిన లారీలు

Published : Apr 28, 2022, 09:40 AM IST
 ఏపీ నుండి కోడిగుడ్ల దిగుమతి:  ఒడిశా పౌల్ట్రీ రైతుల ఆందోళన, రోడ్డుపైనే నిలిచిన లారీలు

సారాంశం

ఏపీ రాష్ట్రం నుండి  కోడిగుడ్ల దిగుమతిని నిరసిస్తూ ఒడిశా రాష్ట్రానికి చెందిన పౌల్ట్రీ రైతుల, వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఏపీ నుండి కోడిగుడ్లను దిగుమతి చేసుకోవడం ద్వారా తాము నష్టపోతున్నామని వారు ఆరోపిస్తున్నారు.


అమరావతి:కోడిగుడ్ల దిగుమతి అంశం Andhra Pradesh, Odisha రాష్ట్రాల్లోని సరిహద్దు వద్ద ఉద్రిక్తతలకు దారి తీసింది. ఏపీ రాష్ట్రం నుండి EGGSను దిగుమతి చేసుకోవడం ద్వారా తమ రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు తగ్గిపోతున్నాయని ఒడిశాకు చెందిన పౌల్ట్రీ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని ఖుర్ధా ప్రాంతంలోని జాతీయ రహదారిపై బుధవారం నాడు ఆందోళన చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఒడిశా, పశ్చిమ బెంగాల్ , మేఘాలయా రాష్ట్రాలకు కోడిగుడ్లతో వెళ్తున్న Lorry లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. రెండు కిలోమీటర్ల దూరంలో లారీలు నిలిచిపోయాయి. మంగళవారం నాడు కూడా ఒడిశాకు చెందిన పౌల్ట్రీ వ్యాపారులు, పౌల్ట్రీ రైతులు ఆందోళనలు నిర్వహించారు. 

ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా కూడా ఫలితం లేకుండా పోయిందని ఒడిశా పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. రోజుల తరబడి తాము కష్టం చేసినా కూడా ఏపీ నుండి గుడ్లను దిగుమతి చేసుకోవడంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళనకారులు చెబుతున్నారు. మరో వైపు  రోడ్డుపైనే  రెండు రోజులుగా  కోడిగుడ్ల లోడ్ తో వెళ్తున్న లారీలు నిలిచిపోవడంతో గుడ్లు పాడయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ కు చెందిన కోడిగుడ్ల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో కోడి గుడ్డుకు కనీస ధరను నిర్ణయించాలని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీకి వ్యతిరేకంగా పౌల్ట్రీ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ తో రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ ఇచ్చేలా చేస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళనను విరమించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?