
ఆయన ఒక పోస్ట్ మాస్టర్. గ్రామానికి వచ్చిన లెటర్ ను ప్రజలకు అందజేయడం, స్థానికుల నుంచి బ్యాంక్ మాదిరిగా డిపాజిట్లను స్వీకరించడం, దానికి సంబంధించిన రశీదులను అందించడం ఆయన పని. అయితే అతడికి ఓ వ్యసనం ఉంది. అదే ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కాయడం. అయితే దీని కోసం తన సొంత డబ్బులతో పాటు ప్రజలు పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేసిన డబ్బులను కూడా ఉపయోగించుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి రూపాయిలను వాడుకున్నాడు. ఆ డబ్బులను బెట్టింగ్ లో కోల్పోవడంతో ఈ బాగోతం బయటకు వచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. బీనాలో పోస్టాఫీసు డిప్యూటీ పోస్ట్‌మాస్టర్ విశాల్ అహిర్వార్ ఐపీఎల్ బెట్టింగ్ కోసం ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బు కోసం ఖాతాదారులు పోస్టాఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కష్ట సమయంలో తమకు ఉపయోగపడుతుందని, కూతుర్ల పెళ్లిలకు, పిల్లల చదువు కోసం అని దాచుకున్న లక్షల రూపాయిలను ఆ పోస్ట్ మాస్టర్ తన కోసం ఉపయోగించుకున్నాడు. పలువురు ఖాతాదారుల నుంచి లక్షల రూపాయలు తీసుకుని నకిలీ పాసుపుస్తకాలు, ఎఫ్ డీలు అందజేశారు.
ముంబైలో దారుణం.. మహిళ మృతదేహాన్ని బ్యాగ్ లో కుక్కి.. రైల్వే ట్రాక్ వద్ద పడేసి..
తాము డిపాజిట్ చేసిన డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు హెడ్ పోస్ట్ ఆఫీసుకు వెళ్లగా.. అక్కడ చెప్పిన విషయం విని ఖంగుతిన్నారు. తమ ఆఫీసులో మీరు డబ్బులు డిపాజిట్ చేసినట్టుగా వివరాలు ఏవీ లేవని చెప్పడంతో ఆ ఖాతాదారులు గుండె ఆగినంత పనైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిప్యూటీ పోస్ట్‌మాస్టర్‌ను అరెస్టు చేశారు. విచారణలో అతడు బెట్టింగ్ ఆడాడని, ఈ మొత్తం కోట్లలో ఉంటుందని తేలింది. ఈ విషయాన్ని నిందితుడు స్వయంగా అంగీకరించాడు. గత రెండు సంవత్సరాలుగా ఇలా జరుగుతుందని పోలీసులు తెలిపారు.
ఒడిశాలో టూరిస్ట్ బస్సు బోల్తా... ఆరుగురు దుర్మరణం, 30మందికి తీవ్ర గాయాలు
‘‘ అరెస్టయిన సబ్-పోస్ట్‌మాస్టర్ విశాల్ అహిర్వార్‌పై ప్రస్తుతం IPC 420 (చీటింగ్), 408 IPC (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా మరిన్ని సెక్షన్లు జత చేసే అవకాశం ఉంది. ’’ అని బీనా GRP పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ ధుర్వే మంగళవారం తెలిపారు. అయితే నిందితుడు బినా పోస్టాఫీసులో నియమితమవ్వడానికి ముందు ఖిమ్లాసాలోని (సాగర్ జిల్లా) సబ్-పోస్టాఫీసులో పని చేశాడు. అయితే అక్కడ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు అని అధికారులు వివరించారు.