రావణుడుగా సీఎం, రాముడిగా ప్రతిపక్ష నేత:రాజకీయ దుమారం రేపుతున్న పోస్టర్లు

By Nagaraju TFirst Published Oct 19, 2018, 4:18 PM IST
Highlights

దసరా పండుగ సందర్భంగా బీహార్‌లో వెలసిన పోస్టర్లు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ను రావణుడిగా, ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌ను రాముడిగా చిత్రీకరిస్తూ ఓ పోస్టర్ వెలసింది. తేజస్వి యాదవ్ ఇంటి సమీపంలో ఈ పోస్టర్ అతికించడంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నడుస్తోంది. 
 

బిహార్: దసరా పండుగ సందర్భంగా బీహార్‌లో వెలసిన పోస్టర్లు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ను రావణుడిగా, ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌ను రాముడిగా చిత్రీకరిస్తూ ఓ పోస్టర్ వెలసింది. తేజస్వి యాదవ్ ఇంటి సమీపంలో ఈ పోస్టర్ అతికించడంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నడుస్తోంది. 

ఆర్జేడీ పోస్టర్‌ను ఆవిష్కరించింది. తేజస్వీ ఇంటి సమీపంలోనే ఏర్పాటు చేసిన ఈ పోస్టర్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం చెలరేగుతోంది. పోస్టర్ పై అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీఎం స్థాయిని దిగజార్చేలా పోస్టర్‌ ఉందని మండిపడుతోంది.

అయితే ప్రతిపక్ష పార్టీ మాత్రం పోస్టర్ ను సమర్థించుకుంటుంది. నితీష్‌ కుమార్‌ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేశారని, ప్రజలకు ఆయనపై ఉన్న కోపంతోనే ఈ పోస్టర్‌ను తయారు చేశారని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు.  

ఈ నెల 21 నుంచి ప్రతిపక్ష నేత తేజస్వీ నాలుగో విడత సంవిధాన్‌ బచావో న్యాయ్‌ యాత్రను  ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే ఆర్జేడీ మద్దతుదారులు ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అటు కాంగ్రెస్ పార్టీ సైతం పోస్టర్ ఏర్పాటు చేయడాన్ని ఖండించింది. రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తిని రావణుడిగా చిత్రీకరించడం సబబు కాదని చెప్పుకొచ్చింది. జేడీయూ మిత్రపక్షం బీజేపీ మాత్రం పోస్టర్ పై ఎలాంటి ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.    

click me!